నేడు తిరుపతిలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పర్యటన

by srinivas |
నేడు తిరుపతిలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పర్యటన
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచార రంగంలోకి దిగనున్నారు. ఇందుకోసం పవన్ నేడు తిరుపతికి రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయాన్ని చేరుకుంటారు. అనంతరం ఎమ్మార్‌పల్లి కూడలి నుంచి శంకరంబాడి సర్కిల్ వరకూ పవన్ కళ్యాణ్ ర్యాలీగా తిరుపతికి వెళ్తారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో సమావేశమవుతారు. అనంతరం తిరుమలకు బయలదేరనున్న జనసేనాని.. రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత తిరుపతిలో మీడియాతో మాట్లాడతారు. ఈ పాదయాత్రలో బీజేపీ-జనసేన ముఖ్య నేతలు పాల్గొనబోతున్నారు.

Advertisement

Next Story