- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్నేహలత హత్యకు కారణం వ్యవస్థల నిర్లక్ష్యం: పవన్
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రచారం కోసం చట్టాలు చేస్తే మహిళలకు రక్షణ దొరుకుతుందా అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వ్యవస్థల వైఫల్యమే స్నేహలత ప్రాణాలు తీసిందని ఆయన విమర్శించారు. నేరం చేస్తే 21 రోజుల్లోనే దిశ చట్టం కింద శిక్ష అంటూ ప్రచారం చేసిన ప్రభుత్వం ఆచరణలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదన్నారు. దీనికి తోడు మైనర్, విద్యార్థినిలు, యువతులు, మహిళలపై అత్యాచారాలు పెరిగాయని చెప్పారు. ఉన్మాదుల చేతిలో అమాయకులు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద కుటుంబానికి చెందిన స్నేహలత వ్యవస్థల నిర్లక్ష్యంతో దుర్మార్గుల చేతిలో ప్రాణాలు కోల్పోయిందన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలుగాలని పవన్ సానుభూతి తెలిపారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Advertisement
Next Story