‘మా అక్క ప్రాణాలకు ప్రమాదం ఉంది’

by Anukaran |
‘మా అక్క ప్రాణాలకు ప్రమాదం ఉంది’
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిల ప్రియను బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు ఊహించని విధంగా రోజుకో మలుపు తిరుగున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి భూమ అఖిలప్రియ సోదరి మౌనిక ఆసక్తికర వ్యాఖ్యలు వెల్లడించారు. తన సోదరి మాజీమంత్రి అఖిలప్రియకు ప్రాణహాని ఉందని తెలిపారు. తమకు ఎక్కడా రక్షణ లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి నుంచి అఖిలప్రియను తీసుకెళ్లే విధానం అదేనా? అని మౌనిక ప్రశ్నించారు. ఆమెను రహస్యంగా ఎందుకు తీసుకెళ్లారని నిలదీశారు.

అంతేగాకుండా ‘‘మా అక్కను నానా కష్టాలు పెడుతున్నారన్నారు. ఆమెకు తీవ్ర జ్వరం ఉంది. హెల్త్ కండీషన్ ఒకలా ఉంటే.. పోలీసులు ఇంకోలా స్టేట్ మెంట్ ఇస్తున్నారు. ఇంత అన్యాయం జరుగుతుంటే అందరూ సినిమా చూసినట్లు చూస్తున్నారు. ఈ కేసుపై కూర్చుని మాట్లాడుకుందాం. దయచేసి సీఎం కేసీఆర్ గారు దీనిపై హెల్ప్ చేయాలి. మా అడ్వకేట్ అక్క దగ్గరకు వెళ్లేసరికి కళ్లు తిరిగి కింద పడిపోయి, డీ హైడ్రేషన్ కారణంగా ముక్కు నుండి రక్తం కారుతుంది. చనిపోతుంటే చూస్తూ కూర్చోవాలా ఏదైనా ఉంటే కోర్ట్ చూసుకుంటుంది. పోలీసులు ఎందుకు ఇన్వాల్ అవుతున్నారో నాకు అర్ధం కావడంలేదన్నారు. సీఎం బంధువులమన్నప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్, కవిత ఎవరైనా మాపై దయతలచాలి. రాత్రికి రాత్రే ఏం జరిగిందో అర్ధం కావడం లేదు. ఉన్నట్టుండి మా అక్క A2 నుంచి A1గా అఖిల ప్రియను ఎలా మారుస్తారన్నారు. మేం కూడా హైదరాబాద్‌లోనే ఉన్నాము. ఓట్లు కూడా వేశామన్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే పాకిస్థాన్‌లో ఉంటున్నామా.. హైదరాబాద్ లో ఉంటున్నామా అనేలా ఉందని’’ అని భూమ మౌనిక ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story