- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యేకు సొంత కారుపై ఉన్న శ్రద్ధ… వాటిపై లేదు
దిశ, హుస్నాబాద్: ప్రజలు ప్రమాదాల బారిన పడితే ప్రైవేట్ వాహనాలే దిక్కవుతున్నాయని, ఎమ్మెల్యేకు సొంత వాహనంపై ఉన్న శ్రద్ధ అంబులెన్స్ పైన లేదని సీపీఐ, కాంగ్రెస్, తెలంగాణ ఇంటి పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా అనభేరి, సింగిరెడ్డి భూపతిరెడ్డి అమరుల భవనంతో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కరీంనగర్, వరంగల్, జనగాం, సిద్దిపేట జిల్లాలకు కేంద్ర బిందువైన హుస్నాబాద్ ప్రాంతానికి అంబులెన్స్ లేక రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారు మండిపడ్డారు. గతంలో ఆసుత్రికి కేటాయించిన అంబులెన్స్ ఉన్నా… నడిపేందుకు సిబ్బంది లేకపోవడం నేడు ఎండకు ఎండుతూ వానకు నానుతూ తుప్పు బట్టి పొతుందన్నారు.
ఆసుపత్రికి వచ్చిన రోగులను జిల్లా కేంద్రాలకు తరలించేందుకు అంబులెన్స్ లేకపోవడంతో రోగులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తే వారు రోగులను అందినకాడికి దోచుకుంటున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ప్రతి నియోజకవర్గానికి అన్ని వసతులతో 100పడక ఆసుపత్రిని నిర్మిస్తామని చెప్పి ఏండ్లు గడుస్తున్నా నేటికీ అమలుకు నోచుకోలేదనని ఆరోపించారు. హుస్నాబాద్ హాస్పిటల్‌ను 30 పడకల నుంచి 50 పడకల ఆసుపత్రిగా మార్చి ఏండ్లు గడుస్తున్నా, నేటికీ వైద్యవిధాన పరిషత్ పరిధిలోకి తీసుకురాకపోవడం నియోజకవర్గ ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారన్నారు.