ఆ లిస్ట్‌లో.. అనుష్క, విరాట్, మోదీ

by Shamantha N |
ఆ లిస్ట్‌లో.. అనుష్క, విరాట్, మోదీ
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ ఏడాది ఇంపాక్ట్ చూపించిన ‘గ్లోబల్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సెర్స్’ లిస్ట్‌ను డేటా కలెక్షన్ అండ్ అనాలిసిస్ ప్లాట్‌ఫామ్ ‘హైప్ ఆడిటర్’ తాజాగా విడుదల చేసింది. టాప్ 25లో ముగ్గురు భారతీయులకు స్థానం దక్కగా.. వారిలో పవర్ కపుల్ విరుష్క జోడీ ఉండటం విశేషం.

ఇన్‌స్టా వేదికగా తమ వాయిస్‌‌ను వినిపించడంతో పాటు తాము చేసే పనుల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ, ప్రభావితం చేయగలిగే వ్యక్తుల జాబితాతో హైప్ ఆడిటర్ ఈ ‘గ్లోబల్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్స్‌’ను జాబితాను రూపొందిస్తుంది. ఈ ఏడాదికిగాను ఈ లిస్ట్‌లో ప్రపంచ మేటి ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో టాప్ పొజిషన్ సొంతం చేసుకోగా, అమెరికన్ మీడియా పర్సనాలిటీస్ కైలీ జెన్నర్, కెండాల్ జెన్నర్‌లు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇక టాప్ 25లో భారత్ రన్ మిషన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మలు ఉండగా, వీరి తర్వాత ఇండియా నుంచి భారత ప్రధాని మోదీ మాత్రమే టాప్ 25లో ఉన్నారు.

అనుష్క, విరాట్‌ల ఇన్‌స్టా అకౌంట్స్‌కు 240 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా, పలు టాప్ కంపెనీలకు వీళ్లు బ్రాండ్ అంబాసిడర్లుగా కొనసాగుతున్నారు. రోజురోజుకూ తమ మాసివ్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ పోతున్న ఈ లవ్లీ కపుల్.. ఇటీవలే తమ మూడో పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక జనవరిలో విరుష్క జోడీ తల్లిదండ్రులుగా ప్రమోట్ కానున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story