- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
8 కోట్ల భారీ విరాళం ఇచ్చిన ఓలా!
దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటికే కొవిడ్-19తో పోరాటానికి అనేక సంస్థలు, ఎంతోమంది ప్రముఖులు ప్రభుత్వాలకు సాయాన్ని అందించాయి. ఇంకా అదిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలకు సాయంగా అందించడానికి తాజాగా ప్రముఖ క్యాబ్ సర్వీసుల సంస్థ ఓలా గ్రూప్ పీఎం కేర్స్ నిధికి రూ. 5 కోట్లను విరాళంగా ఇస్తున్నట్టు వెల్లడించింది. అలాగే, వివిధ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌లకు కూడా రూ. 3 కోట్లు విరాళం అందిస్తున్నట్టు వెల్లడించింది. ఈ విషయాలను ఓలా గ్రూప్ సీఈవో భవీష్ తెలిపారు. కరోనా మహమ్మారితో ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో భాగంగ, అండగా ఉండేందుకు పీఎం కేర్స్‌కు రూ. 5 కోట్లు, పలు రాష్ట్రాల ప్రభుత్వాలకు రూ. 3 కోట్లు ఇస్తున్నామని ఆయన వివరించారు.
ఓలా ఇదివరకే తమ సంస్థలో పనిచేస్తున్న క్యాబ్ డ్రైవర్లు, ఆటో వాలాలను ఆదుకునేందుకు నిధుల సేకరణ కోసం ‘డ్రైవ్ ది డ్రైవర్ ఫండ్’ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ వారికోసం తన సంవత్సరం జీతం వదులుకుంటానని ప్రకటించారు.
Tags: Ola, Ola Cabs, Bhavish Aggarwal, Coronavirus, Ola Donates To PM CARES FUND