- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆయన అడగగానే ఒకే అనడం తప్ప నాకు వేరే మార్గం లేదు.. జస్టిస్ ఎన్వీ రమణ
దిశ, శేరిలింగంపల్లి: సీనియర్ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ‘బ్లడ్ సాండర్స్’ అనే పుస్తకం రాశారు. ఈ పరిశోధనాత్మక పుస్తకాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆన్‌లైన్ ద్వారా అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్లడ్ సాండర్స్ పుస్తకం వెనక సుధాకర్ రెడ్డి పరిశోధన, కృషిని కొనియాడారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ విషయంపై పరిశోధన చేశారని తెలిపారు. స్మగ్లింగ్ రాకెట్ నడిపే వ్యక్తులతో, వారికి అడ్డుకట్ట వేసే అధికారులలతో ఆయన ప్రత్యక్షంగా మాట్లాడారన్నారు. ఆయన పరిశోధనలో తెలుసుకున్న ప్రతీ విషయాన్ని పుస్తకంలో రాశారన్నారు. ఈ పుస్తకం రాయడానికి ఉడుముల సుధాకర్ అన్ని విధాలుగా అర్హుడని అన్నారు జస్టీస్ ఎన్వీ రమణ.
పుస్తక అవిష్కరణ కోసం సుధాకర్ రెడ్డి తనను సంప్రదించినప్పుడు సరే అని చెప్పడం తప్ప నాకు వేరే మార్గం లేదన్నారు. ఉడుముల సుధాకర్ జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన తొలినాళ్ల నుండి తనకు తెలుసన్నారు. ప్రస్తుతం ఆయన ఆంగ్ల దినపత్రికలో ఎడిటర్ స్థాయికి ఎదిగినందుకు ఎంతో సంతోషిస్తున్నానని జస్టీస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార హక్కుల మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.