రెడ్ : ఇస్మార్ట్ హీరో సాంగ్ మేకింగ్ వీడియో

by Shyam |   ( Updated:2023-12-17 14:49:38.0  )
రెడ్ : ఇస్మార్ట్ హీరో సాంగ్ మేకింగ్ వీడియో
X

ఇస్మార్ట్ శంకర్ మూవీతో హిట్ అందుకున్న ఇస్మార్ట్ హీరో రామ్.. రెడ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నారు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడగా అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ చేయలేకపోతుంది మూవీ యూనిట్. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై రవి కిషోర్ సినిమాను నిర్మిస్తుండగా తిరుమల కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్న… ఈ మూవీ నుంచి నువ్వే నువ్వే సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు.

రమ్య బెహ్రా, అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాటకు సమీర్ రెడ్డి కొరీయోగ్రఫర్ గా పని చేశారు. ఇటలీలో పాట చిత్రీకరణ జరగగా.. సాంగ్ మేకింగ్ ను చాలా ఎంజాయ్ చేసినట్లు తెలిపారు హీరో రామ్. కాగా రామ్ తన స్టెప్స్ తో మరోసారి ప్రేక్షకులకు ట్రీట్ ఇచ్చెలానే ఉన్నాడు. మాళవిక నాయర్, అమృత అయ్యర్ హీరోయిన్లు. కాగా ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ తమిళ్ మూవీ తడం రీమేక్.

Advertisement

Next Story