- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలి
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ ప్రకారం ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ఓయూ బహుజన విద్యార్థి సంఘాలు, ఓయూ జేఏసి డిమాండ్ చేసింది. నిరుద్యోగ యువకుడు మెహమ్మద్ షబ్బీర్ ఆత్మహత్యకు నిరసనగా ఓయూలో కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్దం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బహుజన విద్యార్థి సంఘాల నాయకులు వేల్పుల సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న మెహమ్మద్ షబ్బీర్ కుటుంబాకి రూ.50 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బంగారు తెలంగాణ కాదు ఆత్మహత్యల తెలంగాణగా సీఎం కేసిఆర్ మార్చాడని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన అంశమైన నియామకాల కోసమే 1200 మంది విద్యార్థులు బలిదానం చేసుకున్నారని తెలిపారు. అటువంటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాల తరువాత కూడా నిరుద్యోగుల ఆత్మహత్యలు కొనసాగడానికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమన్నారు. నిరుద్యోగులు ఎవరు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, పోరాటాలతోనే ప్రభుత్వం మెడలు వంచి ఉద్యోగ నోటిఫికేషన్లు సాదించుకుందామని పిలుపునిచ్చారు.