సోషల్ మీడియా ఖాతాలకు ఆధార్ లింక్?

by Shyam |
సోషల్ మీడియా ఖాతాలకు ఆధార్ లింక్?
X

ధార్ నెంబర్‌ను అన్ని రకాల వ్యక్తిగత ఖాతాలకు అనుసంధానించాలని ప్రభుత్వం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగా సోషల్ మీడియా ఖాతాలకు కూడా ఆధార్ అనుసంధానం ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ స్పష్టతనిచ్చారు.

బుధవారం ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ – సోషల్ మీడియా ఖాతాలకు ఆధార్ అనుసంధించాలన్న ప్రతిపాదన ఏదీ లేదని వెల్లడించారు. దీనికి సంబంధించి ఓ లిటిగేషన్ కూడా సుప్రీం కోర్టు వద్ద కూడా పెండింగ్‌లో ఉంది. గత అక్టోబర్‌లో ఇలాంటి లిటిగేషన్లను సుప్రీం కోర్టు, హైకోర్టులకు బదిలీ చేసింది.

జులై 2018లో మద్రాసు హైకోర్టులో ఈ అంశం మీద మొదటి కేసు ఫైల్ అయింది. వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలకు ఆధార్ లేదా మరేదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు అనుసంధానాన్ని తప్పనిసరి చేయాలని కోరుతూ పిటిషన్‌దారు అందులో కోరాడు. ఆ పిటిషన్‌కు తమిళనాడు ప్రభుత్వం మద్దతు పలికింది. ఇలా చేయడం వల్ల ఉగ్రవాద మెసేజ్‌లు, అశ్లీల వీడియోలు, తప్పుడు వార్తలను కట్టడి చేయవచ్చని భావించింది. కానీ ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వెబ్‌సైట్లు ఈ ఐడియాను అంగీకరించలేదు. వినియోగదారుడి వ్యక్తిగత స్వేచ్ఛ దెబ్బతింటుందని కంపెనీలు అభిప్రాయపడ్డాయి.

Advertisement

Next Story