- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుక్కకు ఆ పేరు పెట్టిందని.. కొడుకు ముందే తల్లిని తగులబెట్టిన పక్కింటి మహిళలు
దిశ, వెబ్ డెస్క్: గుజరాత్ లో దారుణం చోటు చేసుకుంది. కుక్కకు తన పేరు పెట్టిందని పక్కింటి మహిళను ఆమె కొడుకు ముందే పొరుగింటి మహిళలు కిరోసిన్ పోసి నిప్పంటించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ లోని శక్తినగర్ ఎక్స్ టెన్షన్ లో నివసించే ఓ మహిళ తన కుక్కకు ఓ పేరు పెట్టింది. అయితే, పొరిగింటిలో ఉండే మహిళ పేరు కూడా అదే కావడంతో ఆ మహిళ ఈమెపై మండిపడింది. ఈ విషయమై చాలాసార్లు వీరి మధ్య గొడవ జరిగింది. ఆమెపై కక్ష్య పెంచుకున్న ఆ మహిళ మరికొంతమంది మహిళలతో కలిసి ఆమె ఇంట్లోకి ప్రవేశించింది. అనంతరం వారందరూ కలిసి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న ఆమె కొడుకు తల్లి కళ్ల ముందే కాలిపోతుంటే గట్టిగా కేకలు వేస్తూ ఏడిచాడు. ఆ కేకలు విని బాధిత మహిళను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారని పోలీసులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఐదుగురు పొరుగింటి మహిళలను అరెస్ట్ చేశారు.