శివన్ బర్త్‌డేకు నయన్ ఖర్చు?

by Shyam |
శివన్ బర్త్‌డేకు నయన్ ఖర్చు?
X

దిశ, వెబ్‌డెస్క్:

లేడీ సూపర్‌స్టార్ నయన్, డైరెక్టర్ విఘ్నేష్ శివన్.. తమ ప్రేమ ప్రయాణం పెళ్లి పీటల దాకా ఎప్పుడు వెళ్తుందనేది తమకే తెలియదని క్లారిటీనిచ్చి ఫేక్ న్యూస్‌కు చెక్ పెట్టారు. ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ.. లైఫ్‌ను సూపర్‌‌గా ఎంజాయ్ చేస్తూ, పెళ్లి గురించి ఇప్పుడే ఆలోచించాల్సిన అవసరం లేదన్నట్లుగా ఉన్నారు. కాగా, ఈ ఏడాది శివన్ పుట్టినరోజును నయన్ గోవాలో ప్లాన్ చేసింది. మామూలుగా అయితే బర్త్‌డే కోసం విదేశాలకు చెక్కేసే ఈ జంట.. ఈ సారి గోవా అందాలను ఆస్వాదిస్తూ ఆనందంగా గడిపారు.

శివన్ బర్త్‌డే రోజున సూపర్‌గా పార్టీ చేసుకుని ఆ ఫొటోలను పోస్ట్ చేసి నెట్టింట రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రిప్ కోసం నయన్ ఏకంగా రూ. 25 లక్షల రూపాయలు ఖర్చు చేసిందని కోలీవుడ్ మీడియా ప్రచారం చేస్తోంది. కాగా, పుట్టినరోజున నయన్, శివన్ పిక్ ఎంత వైరల్ అయిందో ప్రస్తుతం ఈ న్యూస్ అంతకు మించిన వైరల్ అవుతోంది. కాగా నయన్ తల్లి పుట్టినరోజు కూడా ఈ ట్రిప్‌‌లోనే సెలబ్రేట్ చేశారు.

Advertisement

Next Story