Crime News: భర్తతో కలిసి పిక్నిక్ వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్

by Mahesh Kanagandla |   ( Updated:2024-10-25 12:27:21.0  )
Crime News: భర్తతో కలిసి పిక్నిక్ వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్
X

దిశ, నేషనల్ బ్యూరో: భర్తతో కలిసి పిక్నిక్ వెళ్లిన మహిళపై ఐదుగురు దుండుగులు సామూహిక లైంగికదాడి(Gangrape)కి పాల్పడ్డారు. మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని రేవా జిల్లాలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. రేవా హెడ్‌క్వార్టర్స్ డీఎస్పీ హిమాలి పాఠక్ ఈ ఘటన గురించి మాట్లాడుతూ.. ‘ఆ మహిళకు ఇటీవలే వివాహమైంది. భార్య, భర్త ఇద్దరి వయసు 19 నుంచి 20 ఏళ్ల మధ్య ఉంటుంది. ఇద్దరూ ఇంకా కాలేజీలో చదువుకుంటున్నారు’ అని వివరించారు. వీరిద్దరూ పిక్నిక్(Picnic) కోసం గుర్ ఇండస్ట్రియ్ ఏరియాకు వెళ్లారు. అక్కడ ఇద్దరూ గొడవపడ్డారు. అదే సమయంలో మహిళ వద్దకు ఐదుగురు వ్యక్తులు వచ్చారు. ఆమెను వేధించారు. ఆ తర్వాత గ్యాంగ్ రేప్ చేశారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, కేసు దర్యాప్తు చేస్తున్నామని హిమాలి పాఠక్ వివరించారు. సుమారు వంద మంది అనుమానితులను గుర్తించామని, సెన్సిటివ్ కేసు కాబట్టి బాధితుల వివరాలు బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed