Breaking: రివాల్వర్‌తో కాల్చుకుని మరో ఎస్సై సూసైడ్

by srinivas |   ( Updated:2025-01-31 04:07:49.0  )
Breaking: రివాల్వర్‌తో కాల్చుకుని మరో ఎస్సై సూసైడ్
X

దిశ, వెబ్ డెస్క్: మరో ఎస్సై సూసైడ్ రాష్ట్రంలో కలకలం రేగింది. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని సబ్ ఇన్ స్పె్క్టర్ బలవన్మరణానికి పాల్పడ్డారు. తాను పని చేస్తున్న పోలీస్ స్టేషన్‌లోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన పశ్చిమగోదారి జిల్లా తణుకు(West Godari District Tanuku)లో జరిగింది. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌(Tanuku Rural Police Station)లో పని చేసిన ఎస్సై మూర్తి(SI Murthy)పై కొద్దికాలం క్రితం పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అధికారులు సీరియస్ అయ్యారు. మూర్తి ఇచ్చిన వివరణపై అసంతృప్తి చెందిన ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మూర్తిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు సస్పెన్షన్ కాలం కొనసాగుతోంది.

అయితే మూర్తి తాజాగా తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడున్న తన తోటి సిబ్బందిని కలిశారు. కొద్దిసేపటికే పోలీస్ స్టేషన్ నుంచి భారీగా శబ్ధం వినిపించింది. దీంతో మిగిలిన సిబ్బంది ఏం జరిగిందని చూసే సరికి షాకింగ్ ఘటన కంటపడింది. ఎస్సై మూర్తి తన సర్వీస్ రివాల్వర్‌(Service revolver)తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఉన్నతాధికారులు తనను సస్పెండ్ చేయడం వల్లే మూర్తి మనస్థాపం చెందారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్‌కు వచ్చి బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం.

ఇక రక్తపు మడుగులో ఉన్న ఎస్సై మూర్తిని చూసిన తోటి సిబ్బంది కలత చెందారు. మూర్తితో ఉన్న పరిచయాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. మూర్తి ఇలా చేస్తాడని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఎస్సై మూర్తి మృతి చెందిన స్థలాన్ని అటు ఉన్నతాధికారులు కూడా పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే మూర్తి ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. తన భర్త చావుకు కారణమైన వారిని అరెస్ట్ చేయాలని మూర్తి భార్య డిమాండ్ చేశారు. ఎస్సై మూర్తి మృతితో ఇంటి పెద్దని కోల్పోయారని, ఈ మేరకు ఆ కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు అంటున్నారు. లేని పక్షంలో ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

కాగా తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల పని చేస్తున్న కానిస్టేబుళ్లు, ఎస్సైలు ఈ మధ్యకాలంలో చాలా ఆత్మహత్య చేసుకున్నారు. ప్రధానంగా వినిపిస్తున్న మాట పని ఒత్తిడి. పని భారం, అధికారుల ఒత్తిడితోనే బలవన్మరణాలకు పాల్పడుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంతో ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అంటున్నారు.


Next Story