చుట్టూ పోలీసుల ఇండ్లు.. ఆగని దొంగతనం..

by Sumithra |   ( Updated:2025-01-31 03:51:14.0  )
చుట్టూ పోలీసుల ఇండ్లు.. ఆగని దొంగతనం..
X

దిశ, కోదాడ : చుట్టూ పోలీసుల ఇండ్లే.. చీమ చిటుక్కుమన్నా కనిపెడతారు. సామాన్యుడు రావాలంటేనే భయపడే వీధి. కానీ దొంగకు మాత్రం పోలీసుల ఇండ్లు పక్కన ఉంటే ఏంటి ఎవరైతే ఏంటి ? ఎంచక్కా దొంగతనం చేశారు. ఐదు తులాల బంగారాన్ని చోరీ చేశారు. ఈ సంఘటన కోదాడ పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీలో చోటుచేసుకుంది. పట్టణంలో వరుస దొంగతనాలు చోటు చేసుకోవడంతో ప్రజలు వణుకుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోదాడ పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీకి చెందిన తాళ్ళపాక హైమావతి ఆకుపాముల గ్రామ సర్పంచ్ గా పనిచేశారు. ప్రస్తుతం పట్టణంలో ఫ్యాన్సీ స్టోర్ దుకాణం నడుపుతూ జీవనం సాగించేది.

వాళ్ల సొంత గ్రామం మునగాల మండలం ఆకుపాముల గ్రామానికి వారం రోజుల క్రితం వెళ్ళగా మంగళవారం రాత్రి గుర్తు తెలియని దొంగలు ఇంటిలోకి చొరబడి కబోర్డ్స్ తలుపులు పగలగొట్టి ఉండడంతో చుట్టుపక్కల వారు చూసి ఆమెకు సమాచారం అందించారు. దీంతో ఆమె వచ్చి చూడగా దొంగతనం జరిగినట్లుగా గుర్తించారు. ఇంట్లో ఉన్న రెండున్నర తులాల తాడు, తులం గొలుసు, రెండు రింగుల జతలు, పదివేల రూపాయల నగదు, చిన్నపిల్లల రింగ్స్ 4, నాలుగు జతల చెవి కమ్ములు, 10,000 నగదు దొంగలించారు. సుమారు 5 తులాల బంగారం, నగదు అపహరణకు గురైనట్లుగా వాటి విలువ ఐదు లక్షల రూపాయల ఉటుందని తెలిపారు. విషయం తెలుసుకున్న కోదాడ పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని హైమావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ ఎస్సై రంజిత్ రెడ్డి తెలిపారు.


Next Story