తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ వైపు వెళ్లొద్దు..!

by srinivas |   ( Updated:31 Jan 2025 4:00 AM  )
తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్..  ఆ వైపు వెళ్లొద్దు..!
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala)లో మళ్లీ చిరుత పులి(Cheetah Tiger) భయం పట్టుకుంది. గురువారం సాయంత్రం శిలాతోరణం వద్ద చిరుత సంచరిస్తుండగా భక్తులు గమనించారు. దీంతో ఫారెస్ట్ అధికారుల(Forest officials)కు సమాచారం అందించారు. అయితే వెంటనే స్పందించిన అధికారులు.. సర్వదర్శన టోకెన్ల క్యూలైన్‌(Sarvadarshan Tokens Qline) సమీపంలో చిరుత ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతంలో ఉన్న చిరుతను పట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లోపు భక్తులు(Devotees) అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఒంటరిగా తిరగొద్దని.. గుంపులు గుంపులుగా వెళ్లాలని (TTD officials) సూచించారు. కానీ తిరుమల కొండపై చిరుత సంచరిస్తుండటంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.

భక్తులకు తరచూ జంతువుల బెడద


కాగా తిరుమల శేషాచలం అభయారణ్యం(Tirumala Seshachalam Sanctuary)లోని అడవి జంతువుల(Wild animals) బెడద తరచూ భక్తులను ఇబ్బందులకు గురి చేస్తోంది. నడక మార్గంలో చిరుతలు, కొండచిలువలు, ఎలుగు బంట్లు, కోతులు, దుప్పిలు, జింకలు, అడవి పందులు, అడవి పిల్లులు, నక్కలు ఎక్కువగా సంచరిస్తున్నాయి. గతంలో మూడు చిరుతలు హల్ చల్ చేశాయి. ఈ మధ్యనే ఎలుగు బంటి కూడా కలకలం సృష్టించింది. శ్రీవారి మెట్టు మార్గంలోనూ ఇదే పరిస్థితి తలెత్తుతోంది. కొన్ని రోజుల క్రితం తిరుమల కొండపై కాంటేజుల వద్ద ఆడుకుంటున్న చిన్నారిపై చిరుతపులి దాడి చేసి చంపేసింది. పలు సమయాల్లో క్రూరమృగాల దాడిలో భక్తులు కూడా గాయపడ్డారు. అప్పుడు కూడా ఫారెస్ట్ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. మూడు చిరుతలను బంధించారు. విష నాగులను పట్టుకుని దూరంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

అధికారుల విఫలం

అయితే తిరుమలకు వచ్చే భక్తులకు భరోసా కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. భక్తులు ఫోన్ చేసి చెబితే తప్ప ముందస్తుగా ఎలాంటి చర్యలు చేపట్టడంలేదనే అపవాదను కొందరు ఆపాదిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప ఫారెస్ట్ సిబ్బందిలో చలనం ఉండటంలేదని కొంతమంది భక్తులు ఇప్పటికే బహిరంగంగానే చెప్పారు. ఇప్పటికైనా శేషాచలం అభయారణ్యంపై టీడీపీ, ఫారెస్ట్ అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టాలని అని సూచిస్తున్నారు. ఏడుకొండల స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు భరోసా కల్పించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే శేషాచలం అభయారణ్యంలో ఎర్రచందనం దొంగలు ఎక్కువయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఎర్రచందనం చెట్లను నరకడం వల్లనే జంతువులు తిరుమల కొండవైపు వెళ్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఎర్రచందనం చెట్లను నరికివేయడం వల్ల మరో ఏ మొక్కలు కూడా పెరగడం లేదనే వాదన కూడా ఉంది.


Next Story