- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
సామాన్యూలకు షాక్.. ఫిబ్రవరి 1 నుంచి అమలుకానున్న మార్పులు

దిశ, వెబ్ డెస్క్: ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న విషయం తెలిసిందే. దీంతో ఆర్థిక అంశాలకు సంబంధించిన ఈ నెలలో కీలక మార్పులు ఉండనున్నాయి. సాధారణంగా ప్రతీ నెలా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మార్పులు చేర్పులు కచ్చితంగా ఉంటాయి. బ్యాంకుల వడ్డీ రేట్లలో మార్పులు మొదలు, పథకాల అమలు వరకు కొత్త నెలలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. అయితే అన్ని నెలలతో పోల్చితే ఫిబ్రవరి చాలా ప్రత్యేకం. దీనికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుండడమే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1 నుండి అమలు చేయబడే మార్పులేంటో తెలుసుకుందాం.
LPG ధరలలో మార్పులు
దేశవ్యాప్తంగా LPG ధరలు ప్రతి నెలా మొదటి తేదీన మారుతుంటాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు సవరించిన ధరలను విడుదల చేశాయి. అయితే ఫిబ్రవరి 1న బడ్జెట్ రోజున LPG ధరల అప్ డేట్ ఉండటంతో ధర పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనే ఆసక్తి సామాన్యుల్లో నెలకొంది. కాగా, జనవరిలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర తగ్గించిన సంగతి తెలిసిందే.
UPI లావాదేవీలకు సంబంధించిన కొత్త నియమాలు
ఫిబ్రవరి 1 నుంచి UPI చెల్లింపుల విషయంలో కీలక మార్పులు రానున్నాయి. ప్రత్యేక అక్షరాలను(స్పెషల్ క్యారెక్టర్లు) కలిగిన UPI ఐడీ (@, #, $, %, &, మొదలైనవి)ల ద్వారా చేసే లావాదేవీలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) బ్లాక్ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి సర్క్యులర్ కూడా జారీ చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం.. ప్రత్యేక అక్షరాలను కలిగి ఉన్న UPI లావాదేవీ ఐడీలు ఆమోదించబడవు. ఇప్పుడు ఆల్ఫాన్యూమరిక్ (అక్షరాలు, సంఖ్యలు) లావాదేవీ ఐడీలు మాత్రమే చెల్లుబాటు అవుతాయి.
బ్యాంకింగ్ నిబంధనలలో మార్పులు
కోటక్ మహీంద్రా బ్యాంకు వినియోగదారులకు కీలక అప్ డేట్ అందించింది. ఫిబ్రవరి 1 నుంచి తమ బ్యాంకు కొన్ని సేవలు, ఛార్జీల్లో మార్పులు చేసినట్లు ప్రకటించింది. వీటిలో ప్రధాన మార్పులు ATM లావాదేవీల ఉచిత పరిమితిని తగ్గించడం, ఇతర బ్యాంకింగ్ సేవలపై ఛార్జీలను పెంచడం వంటివి ఉన్నాయి. ఈ మార్పులు బ్యాంకు కస్టమర్లను ప్రభావితం చేయనున్నాయి.
పెరగనున్న మారుతి సుజుకి కార్ల ధరలు
దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఈ ఏడాది మరోసారి కార్ల ధరలను పెంచింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. కారు మోడల్ ఆధారంగా రూ.32,500 వరకు ధరలు పెంచుతున్నట్లు సంస్థ ప్రకటించింది. పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా ఈ ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. ఇక ఈ మార్పు కారణంగా ధరలు పెరిగిన వాటిల్లో.. ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, డిజైర్, బ్రెజ్జా, ఎర్టిగా, ఇగ్నిస్, బాలెనో, సియాజ్, ఎక్స్‌ఎల్6, ఫ్రాంకోక్స్, ఇన్విక్టో, జిమ్నీ, గ్రాండ్ విటారా కార్లు ఉన్నాయి.
ATF ధరలో మార్పు
ఫిబ్రవరి 1 నుండి ఎయిర్ టర్బైన్ ఇంధనం (ATF) ధరలో మార్పు ఉండవచ్చు. చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా 1వ తేదీన ATF ధరలను సవరిస్తాయి. ఈసారి ధరలు పెరిగితే, అది విమాన ప్రయాణికులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.