IPL 2025 : కుప్పకూలిన KKR.. ముంబై టార్గెట్ ఎంతంటే?

by M.Rajitha |
IPL 2025 : కుప్పకూలిన KKR.. ముంబై టార్గెట్ ఎంతంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్(MI vs KKR) మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియం(Vankhade Stadium) వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఫీల్డింగ్ ఎంచుకోగా.. కోల్‌కతా బ్యాటింగ్ కు దిగింది. అత్యంత పేలవంగా ఆడిన కేకేఆర్.. 16.2 ఓవర్లకు 116 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది. కేవలం 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 69 పరుగులు మాత్రమే చేసింది.

కోల్‌కతా జట్టులో రఘువంశీ 26, రమన్ దీప్ 22 పరుగులు చేయగా.. మిగతా ఎవ్వరి స్కోర్ 20 కూడా దాటలేదు. ఒక దశలో స్కోర్ బోర్డ్ 100 అయినా దాటుతుందా అనే అనుమానం కలిగింది. ముంబై జట్టులో అశ్విన్ 4 వికెట్లు తీసి కేకేఆర్ ను ఘోరంగా దెబ్బకొట్టాడు. పాండ్య 2, దీపక్ , బౌల్ట్, విఘ్నేశ్ తలా ఒక వికెట్ తీశారు. కాగా ఈ సీజన్ లో అత్యంత అల్ప స్కోర్ చేసిన జట్టు కోల్‌కతానే కావడం గమనార్హం.

Next Story

Most Viewed