- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సాయంత్రం 5 తర్వాత ఫుడ్ తీసుకుంటున్నారా.. ఈ సమస్య వెంటాడటం పక్కా?

దిశ, వెబ్‌డెస్క్: ఉరుకుల పరుకుల జీవితంలో సరైన సమయానికి ఆహారం కూడా తీసుకోలేకపోతున్నారు. కానీ ఫుడ్ సరిగ్గా తినకపోవడం వల్ల కూడా అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. పైగా ఇంట్లో ఫుడ్ తయారు చేసుకోవడానికి బయట దొరికే ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువ తీసుకోవడం కూడా ఆరోగ్యానికి నష్టమేనంటున్నారు నిపుణులు.
అయితే కొంతమంది బయట తిన్నా, ఇంట్లో అయినా సమయం లేకుండా ఇష్టానుసారంగా తింటుంటారు. కానీ ఆ విధంగా తినడం వల్ల పలు హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అయితే తాజాగా కొలంబియా యూనివర్సిటీ (Columbia University) పరశోధనలో వెల్లడైన విషయాలు చూసినట్లైతే.. ఆలస్యంగా తినడం వల్ల షుగర్ లెవల్స్ (Sugar levels) విపరీతంగా పెరుగుతాయి. రోజంతా కూడా ఎక్కువగానే ఉంటాయి.
అలాగే రాత్రి అయ్యే కొద్ధి బాడీలో షుగర్ లెవల్స్ మందగిస్తూ ఉంటుంది. కాగా సాయంత్రం ఐదు గంటల తర్వాత ఆహారం తిన్నవారిలో షుగర్స్ లెవల్స్ పెరిగి.. తద్వారా గుండె నాళాలు (Heart vessels) దెబ్బతింటాయి. అలాగే గుండె జబ్బులు (Heart diseases) కూడా తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.