Missing: కుంభమేళాలో టీటీడీ ఉద్యోగి మిస్సింగ్..! కొనసాగుతోన్న సెర్చ్ ఆపరేషన్

by Shiva |
Missing: కుంభమేళాలో టీటీడీ ఉద్యోగి మిస్సింగ్..! కొనసాగుతోన్న సెర్చ్ ఆపరేషన్
X

దిశ, వెబ్‌డెస్క్: మహా కుంభమేళాలో టీటీడీ (TTD) ఉద్యోగి అదృశ్యం అయినట్లుగా తెలుస్తోంది. ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj)లో టీటీడీ (TTD) ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో డిప్యూటేషన్‌ (Deputation)పై విధులు నిర్వహించేందుకు దీపాలి సుబ్రమణ్యం (Deepali Subramanyam) అక్కడి వెళ్లారు. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి అదృశ్యమైనట్లుగా తోటి ఉద్యోగులు గుర్తించారు. దాదాపు టీటీడీ నుంచి సుమారు 250 మంది సిబ్బంది ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకు డిప్యుటేషన్‌పై వెళ్ళినట్లుగా సమాచారం అందుతోంది. ఎంతకీ సుబ్రమణ్యం ఆచూకీ లభించకపోవడంతో తోటి ఉద్యోగులు దారాగంజ్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో సుబ్రమణ్యం ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ చేపడుతున్నారు.

అదేవిధంగా మహా కుంభమేళాలో టీటీడీ (TTD) ఉద్యోగి అదృశ్యం అయినట్లు సోషల్ మీడియా (Social Media)లో కూడా వార్తలు వైరల్‌ అవుతున్నాయి. మరోవైపు మహా కుంభమేళా వెళ్తున్న దారిలో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఉత్తరప్రదేశ్‌-మధ్యప్రదేశ్‌ సరిహద్దుల్లో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో లక్షలాది మంది భక్తులు ట్రాఫిక్‌లో ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. సుమారు 50 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మహా కుంభమేళాకు వస్తున్న భక్తులు అక్కడి నుంచి నేరుగా కాశీకి వెళ్తుండటంతో విపరీతంగా రద్దీ నెలకొందని సమాచారం.

కాగా, మంగళవారం త్రివేణి సంగమం ఘాట్ వద్ద అర్ధరాత్రి తొక్కిసలాట జరిగింది. మౌని అమావాస్య రోజున అమృత స్నానం చేసేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో ఘాట్ వద్ద బారికేడ్లు విరిగిపడటంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు మొత్తం 30 మంది భక్తులు మరణించారని, మరో 60 మందికి పైగా గాయాలయ్యాయని డీఐజీ వైభవ్ కృష్ణ అధికారికంగా ప్రకటించారు.


Next Story

Most Viewed