‘ఇసుక కాలి.. ముద్దుపెట్టుకున్న ముక్కు’.. అంటూ అనన్య నాగళ్ల పోస్ట్

by Anjali |
‘ఇసుక కాలి.. ముద్దుపెట్టుకున్న ముక్కు’.. అంటూ అనన్య నాగళ్ల పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: సైడ్ క్యారెక్టర్ రోల్స్ చేస్తూ సినీ ఇండస్ట్రీలో రాణిస్తోన్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల (Ananya Nagalla). వకీల్ సాబ్ చిత్రంతో మరింత ఫేమ్ దక్కించుకుంది ఈ బ్యూటీ. ఇక అప్పటి నుంచి ఈ అమ్మడుకు సినిమాల్లో కీలక పాత్రల్లో అవకాశాలు వస్తున్నాయి. అతి తక్కువ సమయంలోనే ఈ బ్యూటీ టాలీవుడ్‌ను ఏలుతోంది.

డిఫరెంట్ డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఇప్పటివరకు ఈ బ్యూటీ నటించిన ప్రతీ సినిమాల్లో కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో కనిపించి తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుందనడంలో అతిశయోక్తిలేదు. మల్లేశం (Mallesham), ప్లే బ్యాక్ (Play Back), వకీల్ సాబ్ (Vakil సాబ్), మాస్ట్రో (Maestro), ఊర్వశివో రాక్షశివో (Urvashivo Rakshashivo), శాకుంతలం (Shakunthalam), మల్లి పెళ్లి (Malli Pelli), అన్వేషి (Anveshi), తంత్రం, డార్లింగ్ (Darling), పోటెల్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ (Srikakulam Sherlock Holmes) వంటి సినిమాల్లో నటించి మెప్పించింది అనన్య నాగళ్ల.

ఇకపోతే ఈ బ్యూటీ సాయం చేయడంలో కూడా గొప్ప మనసే చాటుకుంటుందోనని తెలుస్తోంది. రీసెంట్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ బ్యూటీ రూ. 5 లక్షలు సాయం చేసిన విషయం తెలిసిందే. అలాగే ఈ ముద్దుగుమ్మ ఓసారి హైదరాబాదు బస్టాండ్ వద్ద పడుకున్న పేదలకు దుప్పట్లు కప్పి మరోసారి గొప్ప మనసు చాటుకుంది. చలికాలం ప్రారంభమవ్వడంలో బస్టాండ్ ఉన్న పలువురి ప్రయాణికులకు, పేదలకు స్వయంగా తన చేతితో బస్టాండ్ లో పడకున్న వారికి దుప్పట్లు కప్పింది. దీంతో ఈ భామపై నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపించారు.

ఇకపోత అనన్య నాగళ్ల ఇన్‌స్టాగ్రామ్ వేదిక తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో ఈ బ్యూటీ బ్యూటిఫుల్ ఫొటోలు షేర్ చేసింది. రెడ్ కలర్ షార్ట్ డ్రెస్ ధరించి.. థైస్ కనిపించేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ బ్యూటీ పిక్స్ వీక్షించిన కుర్రాళ్లు ఫిదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ పిక్స్‌కు అనన్య నాగళ్ల ఓ అదిరిపోయే క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ‘ఇసుక కాలి, సూర్యుడు ముద్దుపెట్టుకున్న ముక్కు’.. అంటూ అనన్య పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Next Story