- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కూతురికి ఫస్ట్ టైం పీరియడ్స్ వస్తే తల్లిదండ్రులు చేసిన పనికి షాక్
దిశ, వెబ్‌డెస్క్: ప్రతీ ఆడపిల్ల ఒక వయసు రాగానే పుష్పవతి అవడం సాధారణమైన విషయం. మన తెలుగు వారి సంప్రదాయం ప్రకారం అయితే అమ్మాయి పెద్దమనిషి అయ్యిందని తెలియగానే ఏ నక్షత్రంలో పుష్పవతి అయిందో తెలుసుకుంటారు. ఆయా నక్షత్రాలను బట్టి ఫ్యూచర్‌లో జరగబోయే మంచి, చెడులను జ్యోతిష్య శాస్త్రాల ద్వారా తెలుసుకుని.. మంచి గడియలు ఉన్న రోజున సంతోషంగా ఫంక్షన్ చేసుకుంటారు కదా. కానీ తాజాగా ఉత్తరఖండ్‌లో డెహ్రాడూన్‌కు చెందిన జితేంద్ర భట్ అనే వ్యక్తి, పెద్ద కుమార్తె రజస్వల కాగానే ఊరంతా పిలిచి పెద్ద వేడుక జరిపించారు.
అంతేకాకుండా తమ కూతురికి రుతుక్రమం అంటే ఎంటో ముందే వివరించారు. సిగ్గుపడాల్సిన అవసరం లేదని, చిన్న బుచ్చుకోవాల్సింది ఏమి లేదని చెప్పారు. ఆ రోజున తనకు జీవితాంతం గుర్తిండిపోయేలా ఊరువాడాను తమ ఇంటికి ఆహ్వానించి కేక్ కట్ చేపించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ‘‘సమాజంలో ఉన్న అపోహాలను పారద్రోలేందుకు మీ వంతు కృషి చేశారు, ఇలాంటి వాళ్లు ఊరుకో జంట ఉన్న సోసైటీలో దురాచారాలు, మూఢనమ్మకాలు ఒక్క తరంలోనే మాయమైపోతాయి.’’ అంటూ జితేంద్రను, ఆయన భార్యను నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.