నా తండ్రి మరణాన్ని గుర్తు చేస్తోన్న వయనాడ్ దుఃఖం : రాహుల్ గాంధీ

by Bhoopathi Nagaiah |
నా తండ్రి మరణాన్ని గుర్తు చేస్తోన్న వయనాడ్ దుఃఖం : రాహుల్ గాంధీ
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎడతెరిపిలేని వర్షాలకు కొండ చరియలు విరిగిపడి దాదాపు 300 వందల మంది ప్రాణాలు కోల్పోయిన వయనాడ్ ప్రాంతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం పర్యటించారు. వయనాడ్ బాధితుల దుఃఖం తన తండ్రి మరణాన్ని గుర్తు చేసి, తనని తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. రాజకీయాలు చేసేందుకు ఇది సమయం కాదని, కేంద్రం తక్షణమే స్పందించి బాధితులను అన్ని రకాలుగా ఆదుకోవాలని సూచించారు. ప్రమాదం జరిగిన చూర్మలాలో రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీతో తిరిగి చూసి బాధితుల కుటుంబాలను ఓదార్చే ప్రయత్నం చేశారు. అలాగే మెప్పడి కమ్యూనిటీ సెంటర్లో బాధితులను కలిసి మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. కాగా వయనాడ్ ప్రమాదంలో ఇప్పటి వరకు వెయ్యి మందిని రక్షించినట్టు, ఇంకా చాలా మంది మట్టి, బండరాళ్ళ కిందనే ఉన్నారని, వారిని వెలికి తీసేందుకు అన్ని ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నట్టు అధికారులు రాహుల్‌కు వివరించారు.

Advertisement

Next Story

Most Viewed