వరద నీటితో వల్గర్ పనులు.. బైక్‌పై వెళ్తున్న మహిళతో అసభ్యకరంగా..

by Aamani |
వరద నీటితో వల్గర్ పనులు.. బైక్‌పై వెళ్తున్న మహిళతో అసభ్యకరంగా..
X

దిశ,వెబ్‌డెస్క్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అతలాకుతలం అవుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాటిని చూడటానికి యువత భారీగా తరలివెళ్తారు.కొన్ని చోట్ల రోడ్లు కూడా జలమయం అయ్యాయి.అందులో భాగంగానే ఉత్తరప్రదేశ్ లోని లఖ్నవ్వూలో రోడ్లు చెరువులను తలపించాయి. ఆ రోడ్డుపై తంటాలు పడుతూ ఒక జంట వెళ్తున్నారు. అది గమనించిన ఆకతాయిలు వరద నీటిని వారిపై చల్లారు.అంతటితో ఆగకుండా వెనక కూర్చున్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ముందుకెళ్తున్న బైక్ను వెనక్కి లాగడంతో ఆ జంట ఆ నీటిలోనే పడిపోయింది. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆకతాయిలను చెదరగొట్టి ఆ జంటను అక్కడి నుంచి పంపించేశారు.


Advertisement

Next Story

Most Viewed