తీవ్రమైన సమస్య.. నెలలో 7 కిలోలు తగ్గడంపై స్పందించిన కేజ్రీవాల్

by Shamantha N |   ( Updated:2024-05-28 09:33:01.0  )
తీవ్రమైన సమస్య.. నెలలో 7 కిలోలు తగ్గడంపై స్పందించిన కేజ్రీవాల్
X

దిశ, నేషనల్ బ్యూరో: తీహార్ జైళ్లో ఉన్నప్పుడు బరువు తగ్గడంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్,ఢిల్లీ సీఎం స్పందించారు. పంజాబ్ బఠిండాలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. జైళ్లో చాలాబరువు తగ్గానని పేర్కొన్నారు. ఓ వ్యక్తి ఎలాంటి కారణం లేకుండా ఒక నెలలో 7 కిలోల బరువు తగ్గితే.. అది సీరియస్ ప్రాబ్లమ్ అని తెలిపారు. డాక్టర్లు తనకు అనేక పరీక్షలు సూచించారని వివరించారు. అన్ని మెడికల్ టెస్టులు చేయించుకోవాలన్నారు. ఏదైనా సీరియస్ ప్రాబ్లమ్ ఉంటే టెస్టుల్లో బయటపడుతుందన్నారు.

ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో కేజ్రీవాల్‌ అరస్టయ్యారు. మార్చి 21న ఈడీ ఆయన్ని అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలులో ఉన్నారు. దాదాపు 50 రోజులపాటు జైల్లో ఉన్న ఆయనకు లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. జూ 1 వరకూ బెయిల్‌ మంజూరు చేసింది. ఇక జూన్‌ 2న ఆయన లొంగిపోవాల్సి ఉంది.

Read More..

కర్ణాటకలో భార్య తల నరికి, మృతదేహాన్ని ముక్కలుగా చేసిన వ్యక్తి

Advertisement

Next Story

Most Viewed

    null