వెబ్ సైట్ తప్పిదం.. 2,800 కోట్ల లాటరీ దక్కలేదని దావా వేసిన వ్యక్తి

by Shamantha N |
వెబ్ సైట్ తప్పిదం.. 2,800 కోట్ల లాటరీ దక్కలేదని దావా వేసిన వ్యక్తి
X

దిశ, నేషనల్ బ్యూరో: జాక్ పాట్ చెల్లించేందుకు నిరాకరించిన లాటరీ సంస్థపై దావా వేశారు అమెరికాకు చెందిన వ్యక్తి. పవర్ బాల్ అనే లాటరీ గేమ్ కంపెనీకి వ్యతిరేకంగా కేసు వేశాడు. వెబ్ సైట్ లో గెలిచిన నంబర్లను చూశానని.. తనకు 2,800 కోట్ల లాటరీ వచ్చిందని పేర్కొన్నాడు. కానీ ఆ డబ్బు చెల్లించేందుకు నిరాకరించినందుకు పరువునష్టం దావా వేశారు. మరోవైపు ఆ నంబర్లు అధికారికం కాదని.. వెబ్ సైట్ ఎర్రర్ అని తెలిపింది కంపెనీ.

వివరాల్లోకి వెళ్తే జాన్ చీక్స్ అనే వ్యక్తి జనవరి 6న పవర్ బాల్ టికెట్ ను కొనుగోలు చేశాడు. దీంతో 340 మిలియన్ డాలర్లు.. అంటే 2,800 కోట్ల లాటరీ వచ్చిందని తెలిపాడు. కానీ జనవరి 7న లైవ్ డ్రాను చూల్లేదని.. తర్వాతి రోజు లాటరీ వెబ్ సైట్ తనిఖీ చేస్తే.. తనకు లాటరీ వచ్చినట్లు తెలిపారు. మూడ్రోజుల పాటు విజేత నంబర్లను చూపించిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కానీ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన నంబర్‌లు పవర్‌బాల్ లైవ్ డ్రా సమయంలో తీసివేసిన వాటికి భిన్నంగా ఉన్నాయని తెలిపాడు.

రిటైలర్ దగ్గర టిక్కెట్‌ను రీడీమ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు తన లాటరీ తిరస్కరించారని పేర్కొన్నాడు. తను విన్నర్ కాదని రిటైలర్ తెలిపాడని వివంచారు. అప్పటి నుంచి టికెట్ ను సేఫ్టీ డిపాజిట్ బాక్స్‌లో ఉంచానని ఫిర్యాదులో పేర్కొన్నాడు. లాటరీ వెబ్‌సైట్‌ను నిర్వహించే డిజిటల్ అడ్వర్టైజింగ్ కంపెనీ తప్పుగా నంబర్లను పోస్టు చేసిందన్నారు. మరోవైపు జాక్‌పాట్ 6,200 కోట్లకు పెరిగింది. దీన్ని టికెట్ హోల్డర్ కూడా క్లయిన్ చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed