ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. దీపావళికి గ్యాస్ సిలిండర్ ఫ్రీ

by Javid Pasha |
ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. దీపావళికి గ్యాస్ సిలిండర్ ఫ్రీ
X

దిశ, వెబ్‌డెస్క్: నవంబర్‌లో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై దేశ ప్రజలందరి దృష్టి పడింది. మరో ఆరు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలను పార్టీలన్నీ సెమీ ఫైనల్‌గా భావిస్తున్నాయి. దీంతో గెలుపొందేందుకు పార్టీలన్నీ కసరత్తులు చేస్తోన్నాయి. మ్యానిఫెస్టోలో ప్రజలపై వరాల వర్షం కురిపిస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగిన క్రమంలో రూ.500కే ఇస్తామని పార్టీలు హామీ ఇస్తోన్నాయి.

యూపీలో ప్రస్తుతం ఎన్నికలు లేనప్పటికీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు శుభవార్త తెలిపారు. దీపావళి కానుకగా గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు. ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు ఒక సిలిండర్‌ను ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఉజ్వల యోజన పధకం కింద ఉత్తరప్రదేశ్‌లో 1.75 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారు. వీరందరికీ సిలిండర్ ఉచితంగా ఇవ్వనున్నట్లు యోగి పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా ఉజ్వల యోజన పథకం కింద బీపీఎల్ కుటుంబాలకు ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లు అందిస్తోంది. దీని ద్వారా ఇచ్చే సిలిండర్ ధరను రూ.300 తగ్గిస్తున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో లబ్ధిదారులకు కాస్త ఊరట కలిగిందని చెప్పవచ్చు. గ్యాస్ సిలిండర్ ధరలు ప్రస్తుతం సామాన్యులకు చుక్కలు చూపెడుతున్నాయి. ఇలాంటి తరుణంలో యూపీలోని ప్రజలకు ఒక సిలిండర్ ఫ్రీగా ఇస్తామని చెప్పడం అక్కడి పేదలకు లాభించే అంశం.

Advertisement

Next Story

Most Viewed