ఆరోపణలు నిజమైతే పూజా ఖేద్కర్‌ను సర్వీస్ నుంచి తొలగించే అవకాశం?

by S Gopi |
ఆరోపణలు నిజమైతే పూజా ఖేద్కర్‌ను సర్వీస్ నుంచి తొలగించే అవకాశం?
X

దిశ, నేషనల్ బ్యూరో: వివాదాస్పద ట్రెయినీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది. తాజాగా విపరీత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె కెరీర్ కూడా ఇప్పుడు సమస్యగా మారింది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డమే కాకుండా, యూపీఎస్‌సీకి నకిలీ అఫిడవిట్‌ సమర్పించారనే ఆరోపణల కారణంగా కేంద్రం కమిటీని ఏర్పాటుచేసింది. దీంతో దర్యాప్తులో ఆమెపై ఉన్న ఆరోపణలు నిజమైతే పూజా ఖేద్కర్‌ను సర్వీసుల నుంచి తొలగించే అవకాశం ఉందని సమాచారం. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అదనపు కార్యదర్శి మనోజ్ ద్వివేది ఆమెపై విచారణ ప్రారంభించారు. ఆయన రెండు వారాల్లోగా నివేదికను సిద్ధం చేయనున్నారు. వాస్తవాలౌ దాచి, తప్పుడు డాక్యుమెంట్లు ఇవ్వడం వంటి ఆరోపణలు నిజమని తేలితే ఆమె క్రిమినల్ చర్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారం కొనసాగుతుండగానే ఆమె తల్లి గతంలో తుపాకీతో కొందరిని బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం కూడా చర్చనీయాంశమైంది.

Advertisement

Next Story

Most Viewed