- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్..
దిశ, డైనమిక్ బ్యూరో: ఎరువుల్లో స్వయం సమృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇఫ్కో సంస్థ తయారు చేసిన ద్రవరూపంలో ఉండే నానో యూరియా ఎరువులను మార్కెట్లోకి విడుదల చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ శనివారం ట్వీట్ చేశారు. భారత ప్రభుత్వం ఇప్పుడు నానో డీఏపీని ఆమోదించిందని.. ప్రధాని మోదీ ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు ఇది నిదర్శనం అన్నారు. ఈ విజయం రైతులకు మేలు చేస్తుందని తెలిపారు.
కాగా, సాంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా ఇఫ్కో నానో యూరియాను ద్రవ రూపంలో తీసుకువచ్చే ప్రయత్నాలను చాలా కాలంగా చేస్తోంది. దీని ఉత్పత్తి కోసం తయారీ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేసింది. నానో డీఏపీ 500 మిల్లీ లీటర్ల బాటిల్‌ను రూ.600కు విక్రయిస్తామని గతంలో ఇప్కో ప్రకటించింది. ఈ బాటిల్ ప్రస్తుతం1350 రూపాయల విలువ కలిగన ఒక బ్యాగ్ డీఏపీకి సమానం అని తెలిపింది.
తాజాగా నానో యూరియాను మార్కెట్‌లో విక్రయించేందుకు కేంద్ర వ్యవసాయశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నానో ఎరువుల వల్ల భారతదేశానికి విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడంతో పాటు ప్రభుత్వ సబ్సిడీని గణనీయంగా తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణలు అంచనా వేస్తున్నారు. రాబోయే వానాకాలానికి ముంగిట్లో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రైతులకు ఆశాజనకంగా మారనుంది.