- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చెక్ చేసుకో.. దోసెలు వేసుకో! ఆ కేఫ్ మళ్ళీ ఫుల్ బిజీ
దిశ, డైనమిక్ బ్యూరో: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ తాజాగా రీ ఓపెన్ అయ్యింది. బాంబు బ్లాస్ట్ తర్వాత రీ ఓపెన్ కావడంతో ఎప్పటిలాగే కస్టమర్లతో కేఫ్ ఫుల్ బిజీగా మారింది. ఎప్పటిలాగే కస్టమర్లు వచ్చి ఆర్డర్లు ఇస్తూ నచ్చిన అల్పాహారం తిని పోతున్నారు. అయితే బ్లాస్ట్ జరగక ముందు గుంపులు గుంపులుగా వచ్చే కస్టమర్స్.. శనివారం ఉదయం ఓపెన్ కావడంతో గతంలో మాదిరిగా ప్రజలు రామేశ్వరం కేఫ్‌కు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు.
బ్లాస్ట్ నేపథ్యంలో కేఫ్ యాజమాన్యం భద్రతను పెంచింది. కేఫ్ ముందు రెండు మెటల్ డిటెక్టర్‌లు ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ గార్డులు, శరీరాన్ని స్కాన్ చేసే పరికరాలు, బ్యాగుల తనిఖీలు చేపడుతున్నారు. కాగా, రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1వ తేదీన మధ్యాహ్నం పేలుడు జరిగింది. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. కాగా.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనకు కారణమైన వ్యక్తి ఫొటోను ఎన్ఐఏ అధికారులు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.