- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Putin : ‘కుర్స్క్’కు విమోచనం కల్పించి తీరుతాం.. మేం ప్రపంచంలో నంబర్ 4 : పుతిన్
దిశ, నేషనల్ బ్యూరో : ఉక్రెయిన్(Ukraine) సేనల అదుపులోకి వెళ్లిన తమ దేశంలోని కుర్స్క్ ప్రాంతానికి విమోచనం కల్పించి తీరుతామని రష్యా(Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Putin) ప్రకటించారు. అయితే దానికి సంబంధించిన తేదీని ఇప్పుడే చెప్పలేమన్నారు. అక్కడున్న ఉక్రెయిన్ సేనలను రష్యా ఆర్మీ తరిమికొట్టడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ప్రతిరోజూ ఉక్రెయిన్‌లో భారీ విస్తీర్ణంలో భూమిని ఆక్రమించుకుంటూ రష్యా సేనలు ముందుకు సాగుతున్నాయని పుతిన్ వెల్లడించారు. 2024 సంవత్సరం ముగియనున్న వేళ దేశ రాజధాని మాస్కోలో నిర్వహించిన వార్షిక న్యూస్ కాన్ఫరెన్స్‌లో విలేకరుల ప్రశ్నలకు పుతిన్ సమాధానమిచ్చారు. ఈసందర్భంగా ఫోన్ ఇన్ కార్యక్రమానికి కాల్ చేసిన రష్యా ప్రజలతో మాట్లాడి.. వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు.
మా ఆర్థిక వ్యవస్థ సుస్థిరం..
ఓ వైపు యుద్ధంలో ఉన్నా.. మరోవైపు రష్యా ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా పురోగతి బాటలోనే పయనిస్తోందని పుతిన్ వెల్లడించారు. 2024 సంవత్సరంలో ఆర్థిక వృద్ధిరేటుపరంగా తమ దేశం ఐరోపాలో నంబర్ 1 స్థానంలో.. ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉందన్నారు. ఈ ఏడాది రష్యా ఆర్థిక వృద్ధిరేటు 4 శాతం దాకా ఉంటుందన్నారు. ‘‘రష్యాలో నిత్యావసరాల ధరలు పెరుగుతున్న మాట నిజమే. ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వడ్డీ రేట్లను రష్యా సెంట్రల్ బ్యాంకు రెండు దశాబ్దాల గరిష్ఠానికి (21 శాతం) పెంచింది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా దేశ ప్రజల ఆదాయాలు కూడా పెరిగాయి’’ అని ఆయన తెలిపారు. ‘‘డొనాల్డ్ ట్రంప్‌ను కలిసేందుకు నేను రెడీ. గత నాలుగేళ్లలో ఎన్నడూ నేను ట్రంప్‌తో మాట్లాడలేదు. ఒకవేళ ట్రంప్ కోరుకుంటే.. నేను ఆయనను కలుస్తాను’’ అని పుతిన్ స్పష్టం చేశారు.
సిరియాలో రష్యా ఓడిపోలేదు
‘‘సిరియాలో రష్యా ఓడిపోలేదు. అక్కడ మా లక్ష్యాలన్నీ సాధించాం. మాకు ఇప్పటికీ అక్కడ రెండు సైనిక స్థావరాలు(లతాకియా, టార్టస్) ఉన్నాయి. వాటిలో మా సైనికులు ఉన్నారు. ఆ సైనిక స్థావరాలను ఇకపై మానవతా సాయం కోసం వాడుతాం. సిరియాలో ఉన్న 4వేల మంది ఇరాన్ ఫైటర్లను వాళ్ల దేశానికి మేం చేరవేశాం. సిరియా మాజీ అధ్యక్షుడు అసద్ రష్యాకే వచ్చినప్పటికీ.. ఆయనతో ఇంకా నేను మాట్లాడలేదు’’ అని ఆయన పేర్కొన్నారు. రష్యాలో మాంసం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అని ఆయనను ప్రశ్నించగా.. ‘‘ప్రజలు మాంసం ఎక్కువగా తింటున్నారు. వినియోగం పెరిగినందు వల్లే దాని ధరలు పెరిగాయి’’ అని పుతిన్ బదులిచ్చారు.