ఇక ఎయిర్ పోర్ట్‌లో మీ మొహమే 'బోర్డింగ్ పాస్'..

by Vinod kumar |
ఇక ఎయిర్ పోర్ట్‌లో మీ మొహమే బోర్డింగ్ పాస్..
X

న్యూఢిల్లీ : త్వరలో విమానాశ్రయాల్లో మీ ముఖమే బోర్డింగ్ పాస్‌లా ఉపయోగపడుతుంది. బోర్డింగ్ పాస్‌తో పనిలేకుండా సింపుల్‌గా మీ ఫేస్‌ను చూపించి.. సెక్యూరిటీ చెకింగ్ చేయించుకొని బోర్డింగ్‌కు వెళ్లి కూర్చోవచ్చు. భారత విమానాశ్రయ ఆపరేటర్లతో కలిసి పనిచేస్తున్న ఏరోస్పేస్ టెక్ సేవల సంస్థ "థేల్స్" ఈ టెక్నాలజీని డెవలప్ చేసింది. " ఫ్లై టు గేట్" పేరుతో బయోమెట్రిక్ ప్యాసింజర్ జర్నీ సొల్యూషన్‌ను రూపొందించింది.

తాజాగా ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరిగిన ఎయిర్ షోలో 'ఫ్లై టు గేట్' టెక్నాలజీని థేల్స్ కంపెనీ ప్రదర్శించింది. దీని వినియోగం వల్ల ప్రయాణికుల బోర్డింగ్ సమయం సగటున 30 శాతం తగ్గుతుందని థేల్స్ ఇండియా హెడ్, వైస్ ప్రెసిడెంట్ ఆశిష్ సరాఫ్ వివరించారు.

ఫోన్‌లో డిజియాత్ర యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా లేదా నేరుగా ఎయిర్‌పోర్ట్‌‌లోని డిజియాత్ర కియోస్క్‌కు వెళ్లి రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఫ్యూచర్‌లో ఈ సేవలను వాడుకోవచ్చని వెల్లడించారు. భారత్ లోని కొన్ని విమానాశ్రయాల్లో ఇప్పటికే ఉన్న ప్రత్యేక డిజియాత్ర గేట్‌ల ద్వారా ఈ సేవలను పొందొచ్చని తెలిపారు. డిజియాత్ర గేట్‌ వద్దనున్న "థేల్స్ ఫేస్ పాడ్" లో ప్రయాణికులు మొహాన్ని చూపించగానే.. ఆధార్ డేటాబేస్‌లోని ఫోటోతో మొహం మ్యాచ్ అయితే ఫేస్ స్కాన్ పూర్తి అవుతుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed