- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోనియాకు 12 కోట్ల ఆస్తులు..కారు లేదట.. ఇటలీలోనూ ఆస్తి!
దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాజ్యసభ ఎన్నికల కోసం సమర్పించిన అఫిడవిట్‌లో తనకు మొత్తం రూ.12.53 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. ఇటలీలో ఉన్న తండ్రి ఆస్తిలో తన పేరిట రూ.27 లక్షల విలువైన వాటా ఉందని సోనియాగాంధీ వెల్లడించారు. ఇవి కాకుండా తన వద్ద 88 కేజీల వెండి, 1267 గ్రాముల బంగారం, ఆభరణాలు ఉన్నాయని తెలిపారు. న్యూఢిల్లీలోని డేరా మండి గ్రామంలో తనకు మూడు బిగాల వ్యవసాయ భూమి ఉందని సోనియా చెప్పారు. లోక్‌సభ సభ్యురాలిగా వేతనం, రాయల్టీ ఆదాయాలు, మూలధన లాభాల ద్వారా తాను ఆస్తులు కూడబెట్టానని ఆమె స్పష్టం చేశారు. అయితే తన వద్ద కేవలం రూ.90వేల నగదు ఉందన్నారు. తన పేరిట కార్లు కానీ, సోషల్ మీడియా అకౌంట్లు కానీ లేవని సోనియాగాంధీ అఫిడవిట్‌లో చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా సోనియా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తన మొత్తం ఆస్తి రూ.11.82 కోట్లు అని తెలిపారు. ఇప్పుడు ఆస్తి విలువ రూ.12.53 కోట్లు. అంటే గత ఐదేళ్లలో సోనియా ఆస్తి దాదాపు 61వేల రూపాయలు పెరిగింది. తాజా అఫిడవిట్ ప్రకారం.. సోనియా గాంధీ 1964లో ఇటలీలోని సియానాలో ఉన్న ఇస్టిటుటో శాంటా థెరిసా నుంచి ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషలలో మూడు సంవత్సరాల విదేశీ భాషల కోర్సును పూర్తి చేశారు. 1965లో ఆమె కేంబ్రిడ్జ్‌లోని లెనాక్స్ కుక్ స్కూల్ నుంచి ఇంగ్లీష్‌లో సర్టిఫికేట్ కోర్సు చేశారు.