- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: రాజ్య సభ సభ్యురాలిగా సోనియా గాంధీ ఏకగ్రీవ ఎన్నిక
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ మాజీ అధినేత్రి, ఎంపీ సోనియా గాంధీ రాజ్య సభ సభ్యురాలిగా ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. సోనియా గాంధీ యూనానిమస్‌గా రాజ్య సభ ఎంపీగా ఎన్నికైనట్లు రాజస్థాన్ అసెంబ్లీ కార్యదర్శి ఇవాళ ప్రకటించారు. దీంతో తొలిసారిగా సోనియా గాంధీ పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు. రాజస్థాన్‌లో మూడు రాజ్య సభ స్థానాలు ఖాళీ కావడంతో ఈసీ ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడు స్థానాలకు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. రాజస్థాన్ అసెంబ్లీలో ప్రస్తుత ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం రెండు సీట్లు అధికార బీజేపీకి, ఒకటి కాంగ్రెస్‌కు దక్కనుంది. నామినేషన్ల విత్ డ్రాకు ఇవాళే చివరి తేదీ కాగా.. ముగ్గురే పోటిలో ఉన్నారు. దీంతో వీరి ముగ్గురి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు రాజస్థాన్ అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు.
కాగా, వయస్సు భారం, ఆరోగ్యం సహకరించకపోవడంతో సోనియా గాంధీ ఈ సారి లోక్ సభ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో సోనియా గాంధీని రాజస్థాన్ నుండి రాజ్య సభకు పంపించాలని ఏఐసీసీ నిర్ణయించింది. ఈ మేరకు రాజస్థాన్ నుండి రాజ్య సభ అభ్యర్థిగా సోనియా గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ఎన్నికకు సరిపడా ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉండటంతో సోనియా గాంధీ ఎన్నిక ఏక గ్రీవం అయ్యింది. కాగా, సోనియా గాంధీ 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోటైన రాయ్ బరేలీ స్థానం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆమె ఈసారి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని.. పెద్దల సభలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ సారి రాయ్ బరేలీ నుండి సోనియా కూతురు ప్రియాంక గాంధీ ఎన్నికల బరిలో నిలుస్తారని ప్రచారం జరుగుతోంది.