రేపు రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ వేయనున్న సోనియాగాంధీ

by Shamantha N |
రేపు రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ వేయనున్న సోనియాగాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ రాజ్యసభకు నామినేషన్ వేయనున్నారు. రేపు రాజ్యసభకు నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ వేసే సమయంలో కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సోనియా వెంట రానున్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు సోనియాగాంధీ. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీ విరమణ చేయడంతో రాజస్థాన్ లో పార్టీకి ఉన్న సీటు ఖాళీ అయ్యింది. అక్కడ్నుంచే సోనియా పోటీ చేయనున్నారు.

సోనియా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ నుంచి లోక్ సభ ఎంపీగా ఉన్నారు. 1998 నుంచి 2022 మధ్య దాదాపు 22 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. రానున్న ఎన్నికల్లో రాయ్ బరేలీ స్థానం నుంచి లోక్ సభ ఎంపీగా ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారు. సోనియా గాంధీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న రాహుల్ గాంధీ.. జోడో యాత్రకు బుధవారం బ్రేక్ ఇచ్చారు.

మరోవైపు 15 రాష్ట్రాల నుంచి 56 స్థానాలకు జరిగే రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ఈనెల 15 నామినేషన్లు వేసేందుకు చివరి తేదీ. ఫిబ్రవరి 27న ఓటింగ్ జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed