ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు లక్ష కోట్ల విలువైన షోకాజ్ నోటీసులు జారీ

by Mahesh |   ( Updated:2023-10-25 09:41:22.0  )
ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు లక్ష కోట్ల విలువైన షోకాజ్ నోటీసులు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ఆన్ లైన్ గెమింగ్స్ ఆగస్టులో, ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఉంచిన బెట్టింగ్‌ల పూర్తి విలువపై 28 శాతం వస్తువులు, సేవల పన్ను (జిఎస్‌టి) విధించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. GST అథారిటీ ప్రకారం, ఇంటిగ్రేటెడ్ GSTకి సవరణలు ఆఫ్‌షోర్ ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు భారతదేశంలో నమోదు చేసుకోవడం, దేశీయ చట్టానికి అనుగుణంగా పన్ను చెల్లించడం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్టోబర్ 1 నుండి భారతదేశంలో నమోదు చేసుకున్న విదేశీ గేమింగ్ కంపెనీల డేటా ఇంకా లేదని ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే నాటి నుంచి ప్రభుత్వం వివిధ పన్ను ఎగవేతపై ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు 1 లక్ష కోట్ల విలువైన షోకాజ్ నోటీసులు జారీ చేసింది. భారతదేశంలో పనిచేస్తున్న 100 కంటే ఎక్కువ ఆన్‌లైన్ గేమింగ్ అప్లికేషన్‌లు దాదాపు ₹1 లక్ష కోట్ల మేరకు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఇంటెలిజెన్స్ (DGGI) స్పష్టం చేసింది. గత నెలలో డ్రీమ్11 గేమ్‌స్‌క్రాఫ్ట్‌తో సహా అనేక ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు, పన్నులు తక్కువగా చెల్లించినట్లు ఆరోపించినందుకు షోకాజ్ నోటీసులు జారీ చేయబడ్డాయి. అలాగే డెల్టా కార్ప్ ₹6,384 కోట్ల తక్కువ పన్ను చెల్లించినందుకు GST నోటీసును అందుకుంది. అలాగే గత ఏడాది సెప్టెంబర్‌లో ₹21,000 కోట్ల GST ఎగవేత ఆరోపణలపై GamesKraft కి షోకాజ్ నోటీసు పంపబడింది.

Advertisement

Next Story

Most Viewed