- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
షాకింగ్ సీన్: సమాధి వద్ద లేచిన చనిపోయిన చిన్నారి.. తర్వాత ఏమైందంటే..!
దిశ, వెబ్‌డెస్క్: చనిపోయిన చిన్నారి సమాధి వద్ద లేవడం మెక్సికో దేశంలో కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే.. కామిలా రోక్సానా మార్టినెజ్ మెండోజా అనే మూడేళ్ల చిన్నారికి వాంతులు, కడుపు నొప్పి, జ్వరం ఉండటంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్తారు. దీంతో ఆ చిన్నారికి డాక్టర్ డీహైడ్రేషన్ కోసం చికిత్స చేసి పారాసెటమాల్ మందు ఇచ్చారు. కానీ కామిలా ఆరోగ్యం ఏ మాత్రం మెరుగుపడకపోవటంతో పేరెంట్స్ మరొక ఆసుపత్రికి తీసుకెళ్తారు. అక్కడ వైద్యులు చిన్నారికి పండ్లు, నీరు, ఎక్కువ తీసుకోవాలని చెప్పారు. అయినా చిన్నారి ఆరోగ్యం బాగుపడలేదు.
దీంతో మరొక డాక్టర్‌ను సంప్రదించడంతో డాక్టర్లు నరం ద్వారా మందులు ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు కామిలా చనిపోయింది. కామిలా మరణాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోయారు. కన్నీరుమున్నీరవుతూ.. కామిలాకు అంత్యక్రియలు చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. శవపేటికపై ఉన్న కామిలా కాళ్లు కదులుతున్నాయని తన అమ్మమ్మ గమనించింది. దీంతో ఒక్కసారిగా కుటుంబసభ్యుల్లో భయం చెలరేగింది. వెంటనే చిన్నారికి మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందిస్తున్న క్రమంలోనే కామిలా మళ్లీ మరణించిందని డాక్టర్లు ప్రకటించారు.