- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మనీశ్ సిసోడియాకు షాక్: మరోసారి జ్యుడీషియల్ కస్టడీ పొడగింపు
దిశ, నేషనల్ బ్యూరో: లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత మనీశ్ సిసోడియాకు షాక్ తగిలింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆయన కస్టడీని మరో 12 రోజులు పొడగించింది. ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న సిసోడియా కస్టడీ శనివారంతో ముగియడంతో ఆయనను కోర్టులో హాజరుపర్చారు. ఈ నేపథ్యంలోనే కోర్టు కస్టడీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మద్యం పాలసీ కేసులో సిసోడియా 2023 ఫిబ్రవరి 26 నుంచి జైలులో ఉన్నారు. అంతకు ముందు ఈ నెల 2న సిసోడియా బెయిల్ పిటిషన్ విచారణకు రాగా..ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా విచారణ చేపట్టారు. నన్ను జైలులో ఉంచడం వల్ల లాభం లేదని సిసోడియా కోర్టుకు తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలు ఇంకా నిర్ధారణకు రాలేదు కాబట్టి బెయిల్‌కు అర్హుడినని తెలిపారు. సిసోడియా తరఫున సీనియర్ న్యాయవాది మోహిత్ మాథుర్ ఈ వాదనలు వినిపించారు. కాగా, సిసోడియాను 2023 ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్టు చేసింది అనంతరం జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా మార్చి 9న ఈడీ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆయన తిహార్ జైలులోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పలు మార్లు బెయిల్ పిటిషన్ వేయగా ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టులు తిరస్కరించాయి.