స్వతంత్రంగా ఎన్నికల బరిలో నిలిచిన అత్యంత సంపన్న మహిళ..!

by Gantepaka Srikanth |
స్వతంత్రంగా ఎన్నికల బరిలో నిలిచిన అత్యంత సంపన్న మహిళ..!
X

దిశ, వెబ్‌డెస్క్: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు దేశ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని అన్ని పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గెలిచే సమర్థులనే బరిలోకి దింపుతున్నారు. ఇప్పటికే విడతల వారిగా అభ్యర్థుల జాబితాను సైతం విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భారతదేశంలోనే సంపన్న మహిళ అయిన సావిత్రి జిందాల్‌‌కు టికెట్ ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించింది. ఆమె స్థానంలో ఆరోగ్యశాఖ మంత్రి కమల్‌గుప్తాకు టికెట్ కేటాయించారు.

దీంతో ఆమె కీలక నిర్ణయం తీసుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎన్నికలకు ముందు వరకు ఆమె బీజేపీ టికెట్‌పైనే హిస్సార్‌ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ.. హర్యానా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి.. ఇటీవలే బీజేపీ 67 మందితో తొలి జాబితాను విడుదల చేయగా అందులో సావిత్రి జిందాల్‌కు చోటు ఇవ్వలేదు. దీంతో ఆమె స్వతంత్రంగా హిస్సార్‌ నియోజకవర్గం నుంచి బరిలో నిలవాలని ఫిక్స్ అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed