పెట్రోల్ ధ‌రపై ప్లేట్ ఫిరాయించి, ప్ర‌శ్నించిన‌ జ‌ర్న‌లిస్టుపై రామ్‌దేవ్‌బాబా ఫైర్! (వీడియో)

by Sumithra |
పెట్రోల్ ధ‌రపై ప్లేట్ ఫిరాయించి, ప్ర‌శ్నించిన‌ జ‌ర్న‌లిస్టుపై రామ్‌దేవ్‌బాబా ఫైర్! (వీడియో)
X

దిశ‌, వెబ్‌సైట్ః ప్ర‌కృతి, వికృతి సూత్రంలో 'స‌న్యాసి, స‌న్నాసి' అర్థాలు ఒక‌టే అయినా వాడుక‌లో వాటి భావాలు వేరు. అరిష‌డ్వ‌ర్గాల‌ను జ‌యించినోళ్లు ఒక‌రైతే, వాటి లెక్క‌ల్లో మాత్ర‌మే జీవించేవాళ్లు ఇంకొక‌ళ్లు. కుడి ఎడ‌మైతే పొర‌పాటు లేద‌న్న‌ట్లు, ఆధ్యాత్మిక జీవితం నుంచి 'స‌మాజ సేవ‌'కే అంకిత‌మైన స‌న్యాసీ, యోగా గురువైన‌ రామ్‌దేవ్ బాబా తాజాగా త‌న విశ్వ‌రూపం చూపించారు. పెట్రోల్ ధర తగ్గింపుపై గతంలో ఆయ‌న చేసిన వ్యాఖ్యల గురించి అడిగిన జర్నలిస్టును యోగా గురు రామ్‌దేవ్ ఓపికగా బెదిరించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్ అయ్యింది.

బాబారామ్‌దేవ్ తాజాగా పెట్రోల్ ధ‌ర‌ల‌పై స్పందిస్తూ, 'పెట్రోల్‌ ధరలు తగ్గితే ప్ర‌భుత్వానికి పన్నులురావు. అప్పుడు, దేశాన్ని ఎలా నడుపుతారు? జీతాలు ఎలా చెల్లిస్తారు?, రోడ్లు వేస్తారని ప్రభుత్వం చెబుతోంది. వాట‌న్నింటికీ డ‌బ్బులు కావాలి కాదా..?! అవును, ద్రవ్యోల్బణం తగ్గాలి, అంగీకరిస్తున్నాను.. అయితే ప్రజలు కష్టపడి పనిచేయాలి. నేను స‌న్యాసి అయి ఉండి కూడా తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి రాత్రి 10 గంటల వరకు పని చేస్తాను" అని రామ్‌దేవ్‌బాబా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు. త‌న చుట్టూ కూర్చున్న బాబా సేవ‌కులు చప్పట్లతో ఆయ‌న్ను ప్ర‌శంసించారు. ఈలోగా, ఓ పాత్రికేయుడు పతంజలి బ్రాండ్ అంబాసిడర్ బాబాను గ‌తంలో హర్యానాలోని కర్నాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో, 'లీటరు పెట్రోలు రూ.40కి, గ్యాస్ సిలిండ‌ర్ రూ.300కు అందిస్తాన‌ని, ప్ర‌భుత్వం ప‌రిగ‌ణించాల‌ని' అనిన‌ మాట‌ల‌ను గుర్తుచేస్తూ, మ‌రి ఇప్పుడిలా అంటున్నారేంటంటూ ప్ర‌శ్నించారు.

ప్ర‌శ్న‌పై కోపోధ్రేకుడైన రామ్‌దేవ్, "ఇలాంటి ప్రశ్నలు అడ‌గొద్దు. మీ ప్రశ్నలకు సమాధానమివ్వాల్సిన మీ థెకేదార్ (కాంట్రాక్టర్) నేను కాను?" అంటూ ఊగిపోయారు. జర్నలిస్ట్ మళ్లీ ప్రశ్న అడగడంతో, విలేకరి వైపు చెయ్యి చూపిస్తూ, "నేను ఆ వ్యాఖ్య చేశాను.ఇప్పుడు నువ్వేం చేస్తావు? నోరు మూసుకో. మళ్లీ అడిగితే బాగుండ‌దు. నువ్వు మంచి తల్లిదండ్రులకు పుడితే అలా అడ‌గ‌కు.." అని తీవ్రంగా స్పందించారు. ఈ సంద‌ర్భంగా "కష్ట సమయాల్లో మరింత కష్టపడి పనిచేయాలని" స‌న్యాసి రామ్‌దేవ్ బాబా దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed