దేశంలో ఎక్కువగా మాట్లాడేది రాహుల్ గాంధీయే: కేంద్ర న్యాయ మంత్రి

by Harish |
దేశంలో ఎక్కువగా మాట్లాడేది రాహుల్ గాంధీయే: కేంద్ర న్యాయ మంత్రి
X

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు విరుచుకుపడ్డారు. రాహుల్ దేశ వ్యతిరేక శక్తుల భాషను మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశాన్ని తక్కువ చేసి చూపేలా ఉన్నాయని విమర్శించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎంపీ చర్యను ఖండిస్తూ, లండన్‌లో చేసిన వ్యాఖ్యలకు సభా వేదికపై ఆయన క్షమాపణలు కోరకపోతే ప్రజలు చట్టసభ సభ్యులను ప్రశ్నిస్తారన్నారు. పార్లమెంటులో రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పేలా కోరడం తమ బాధ్యత అని చెప్పారు.

ఆయన తన చర్యల ద్వారా కాంగ్రెస్‌ను నాశనం చేస్తే, వాటిపై మాకు ఎలాంటి ప్రయోజనాలు ఉండవని తెలిపారు. రాహుల్‌కు తన మాటలతో భారతదేశాన్ని కించపరిచే హక్కు లేదని, వాటిని మేము సహించబోమని కిరణ్ అన్నారు. దేశానికి సంబంధించిన ఏ అంశమైన ప్రతి ఒక్కరికి ఆందోళన కలిగిస్తుందని చెప్పారు. రాహుల్‌కు పార్లమెంటులో మాట్లాడేంత సమయం ఇచ్చామని, లండన్‌లో ఆయన ప్రసంగం పూర్తి అబద్ధమన్నారు.

దేశంలోనే అత్యంత ఎక్కువ మాట్లేడేది రాహులేనని అన్నారు. జోడో యాత్ర సమయంలో రాత్రి, పగలు ప్రభుత్వాన్ని విమర్శించారని చెప్పారు. అంతకుముందు లండన్‌లో రాహుల్ మాట్లాడుతూ.. భారత్‌‌లో ప్రజాస్వామ్యంపై దాడి జరగుతుందని విమర్శించారు. పార్లమెంట్ లో ప్రతిపక్ష నేతలకు మాట్లాడేందుకు సమయం ఇవ్వరని ఆరోపించారు. దీనిని బీజేపీ తీవ్రంగా ఖండించింది.

Advertisement

Next Story

Most Viewed