‘మిత్రుల ఖజానా నింపడమే ఈ ప్రభుత్వ లక్ష్యం’

by GSrikanth |
‘మిత్రుల ఖజానా నింపడమే ఈ ప్రభుత్వ లక్ష్యం’
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతున్నా ప్రభుత్వానికి చలనం లేకుండా పోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ప్రజలు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఈ సూట్ బూట్ ప్రభుత్వం మాత్రం తన స్నేహితుల ఖజానా నింపడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. ప్రస్తుతం రెండు భారత దేశాలు ఉన్నాయని ఒకటి సంపన్నుల ఇండియా అయితే మరొకరిది నిరుపేదల ఇండియా అని విమర్శించారు. ఈ రెండు భారతదేశాల మధ్య అంతరం పెరిగిపోతుందని అన్నారు. ఇండియా కన్జ్యూమర్ ఎకానమీ 360 సర్వే ప్రకారం 2016-2021 మధ్య అత్యంత పేద వాళ్లు 20 శాతం మంది ఉంటే దిగువ మధ్య తరగతి ప్రజలు 20 శాతం, మధ్యతరగతి ప్రజలు 20 శాతం, ఎగువ మధ్య తరగతి ప్రజలు 20 శాతం ఉన్నారని మరో 20 శాతం సంపన్నులు ఉన్నారని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed