- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయోధ్య రామ మందిరంపై తపాలా స్టాంపులు.. ఆవిష్కరించిన ప్రధాని
దిశ వెబ్ డెస్క్: భారత ప్రధాని మోడీ నేతృత్వంలో అయోధ్య రామ మందిరం నిర్మాణం దిగ్విజయంగా పూర్తయింది. కాగా ఈ నెల 22 వ తేదీన శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ముహూర్తం కూడా ఖరారు చేశారు. కాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన పనులన్నీ శరవేగంగా పూర్తవుతున్నాయి. ఇక ఈ రోజు అయోధ్య లోని శ్రీ రామ జన్మభూమి మందిరంపై స్మారక తపాలా స్టాంపులు విడుదలైయ్యాయి. ఈ స్మారక తపాలా స్టాంపుల ఆవిష్కరణ ప్రధాని మోడీ చేతుల మీదుగా జరిగింది. కాగా శ్రీరామ జన్మభూమి మందిర్ యొక్క సారాంశాన్ని ఈ స్మారక తపాలా స్టాంపుల్లో పొందుపరిచారు.
శ్రీరామ జన్మభూమి మందిర్ యొక్క సారాంశం నిక్షిప్తమై ఉన్న ఈ స్టాంపుల యొక్క క్లిష్టమైన రూపకల్పన ఆరు విభిన్న భాగాల్లో ఉంది. కాగా ప్రతి స్టాంప్ రామాలయం, గణేష్, హనుమాన్, జటాయుతో సహా రామాయణంలోని ముఖ్య వ్యక్తులు మరియు అంశాలను కళ్ళకు కట్టినట్లు చూపించేలా ఈ స్టాంపులను డిజైన్ చేశారు. ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఈరోజు రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు సంబంధించిన మరో కార్యక్రమంలో పాల్గొనే అవకాశం తనకు లభించిందని హర్షం వ్యక్తం చేశారు. అలానే ప్రపంచవ్యాప్తంగా శ్రీరాముడిపై విడుదల చేసిన స్టాంపుల పుస్తకాన్ని కూడా ఈ రోజు విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక ఈ స్టాంప్ పంచమహాభూతాల యొక్క సంపూర్ణ సామరస్యాన్ని సూచించేలా డిజైన్ చేయబడ్డాయని.. ఇది హిందూ తత్వశాస్త్రంలో అన్ని వ్యక్తీకరణలకు అవసరమైనదిగా పరిగణించబడుతుందని.. స్టాంప్ విడుదలతో పాటుగా రాముడిపై రూపొందించిన 48 పేజీల పుస్తక ఆవిష్కరణ కూడా ఈ రోజు జరిగిందని పేర్కొన్నారు.