- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ దేశాన్ని సర్వనాశనం చేసింది: రాజ్య సభలో నిప్పులు చెరిగిన ప్రధాని మోడీ
దిశ, వెబ్‌డెస్క్: కొన్ని సంవత్సరాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించలేకపోయిందని ప్రధాని మోడీ అన్నారు. గురువారం రాజ్య సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. పార్టీ ఫస్ట్ అనేది కాంగ్రెస్ విధానం.. దేశం ఫస్ట్ అనేది బీజేపీ విధానమని పేర్కొన్నారు. అందరి కోసం పని చేయడమే లౌకికత్వమని.. అధికారం చేపట్టిన రెండు సార్లు పారదర్శక పాలనతో ప్రజల మన్ననలు పొందామన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలన మొత్తం శుద్ధ దండగా అని విమర్శించారు. దేశాన్ని కాంగ్రెస్ సర్వనాశనం చేసిందని మండిపడ్డారు.
దేశ ప్రజలు కాంగ్రెస్‌ను నిరాకరిస్తున్నారని అన్నారు. మేం దేశ ప్రజల కోసం రాత్రి, పగలు కష్టపడతామని తెలిపారు. కొందరు ఎంపీల తీరు బాధ కలిగిస్తోందని.. కానీ మీరు విసిరే బురదలో కూడా కమలం వికసిస్తోందని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ వికాసాన్ని నమ్ముతుందని.. విపక్షాన్ని కాదని అన్నారు. ఇదిలా ఉండగా.. ప్రధాని మోడీ ప్రసంగానికి ప్రతిపక్షాలు అడ్డు తగులుతున్నాయి. అదానీ వ్యవహారంపై ప్రధాని మోడీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. విపక్షాలు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రధాని మోడీ ఆయన ప్రసంగాన్ని అలాగే కొనసాగించారు.