- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వద్వాన్ పోర్టుకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ
దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలోని పాల్ఘర్ లో శుక్రవారం వద్వాన్ నౌకాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. రూ.76 వేల కోట్ల నిధులతో నిర్మించనున్న ఈ భారీ జలాంతర్గత పోర్ట్ దేశంలోనే అతిపెద్ద కంటైనర్ పోర్ట్. అయితే ఈ పోర్ట్ నిర్మాణానికి వద్వాన్ గ్రామస్తులు, బందర్ విరోధి సంఘర్శ సమితి సభ్యులు, స్థానిక మత్స్యకారులు తీవ్ర నిరసనలు తెలిపారు. ఈ పోర్ట్ వలన పర్యావరణానికి హాని కలుగుతుందని, మత్స్యకారుల జీవనోపాధి దెబ్బ తింటుందని ఆందోళనలు చేస్తున్నారు. కాగా 1997 లోనే మహారాష్ట్ర ప్రభుత్వం వద్వాన్ పోర్ట్ ప్రతిపాదన చేయగా.. పాల్ఘర్ గ్రామస్తులు తీవ్ర నిరసనలు తెలపడంతో ఈ ప్రాజెక్టు మొదలవకుండానే ఆగిపోయింది. కాని ఇపుడు దేశ జీడీపీలో పోర్టుల సహకారం విడదీయరానిదిగా తయారైనందున.. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన 'సాగర్ మాల' ప్రొజెక్టులో భాగంగా తిరిగి వద్వాన్ పోర్ట్ ఏర్పాటుకు బాటలు పడ్డాయి. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ తో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు.