Viral: అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్!.. ఫ్లైఓవర్ పై నుంచి పడిన మరణించలేదు

by Ramesh Goud |
Viral: అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్!.. ఫ్లైఓవర్ పై నుంచి పడిన మరణించలేదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కారు ఢీ కొట్టడంతో ఓ మహిళ ఫ్లైఓవర్ పిల్లర్ పై పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. నోయిడాలో ఓ మహిళ సెక్టార్-18 నుంచి సెక్టార్-62 వైపు వెళ్లేందుకు ఎలివేటెడ్ రహదారిపై స్కూటీలో ప్రయాణిస్తుంది. అయితే ఆమె ప్రయాణిస్తున్న స్కూటీని అకస్మాత్తుగా ఓ కారు వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టింది. దీంతో ఆ మహిళ గాల్లో ఎగిరి ఫ్లైఓవర్ మధ్యలో ఉన్న సందులో పడిపోయింది. అదృష్టవశాత్తు కింద పడకుండా పిల్లర్ పైన పడటంతో ఆ మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. అయితే ఆ మహిళను రక్షించేందుకు మరో ఇద్దరు యువకులు ఫ్రైఓవర్ పిల్లర్ పైకి దిగి వారు కూడా దాదాపు గంటకు పైగా అక్కడే చిక్కుకుపోయారు.

దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. కింద పడి ఉంటే మరణించి ఉండేదని, వెంట్రుక వాసిలో ప్రాణాలు నిలుపుకుందని, అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ ఆ మహిళ అని కామెంట్లు పెడుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని, హైడ్రాలిక్ ప్లాట్ ఫారమ్ ద్వారా ఆ మహిళ సహా ఇద్దరు యువకులను కిందికి దించారు. అనంతరం ఆ మహిళను హస్పిటల్ కు తరలించారు. దీనిపై నోయిడా అదనపు డిప్యూటీ కమిషనర్ మనీష్ మిశ్రా మాట్లాడుతూ.. పిల్లర్ పై చిక్కుకున్న మహిళ స్వల్ప గాయాలతో బయటపడిందని, మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, దీనిపై దర్యాప్తు చేపట్టి నిందితులను కనిపెడతామని వెల్లడించారు. https://x.com/SachinGuptaUP/status/1837427277031735355

Next Story

Most Viewed