- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆయన రాకతో నాలో ఉత్సాహం రెట్టింపు అయింది.. రజినీకాంత్ కామెంట్స్ వైరల్
దిశ, సినిమా: సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్ తాజా చిత్రం ‘వెట్టైయాన్- ది హంటర్’. కె.ఇ.జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించారు. దసరా సందర్భంగా ఈ మూవీ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా.. శుక్రవారం ఈ సినిమా ఆడియో వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో.. సూపర్‌స్టార్ రజినీకాంత్ మాట్లాడుతూ ‘‘వెట్టైయాన్- ది హంటర్’ సినిమా నిర్మాణం చేసిన లైకా ప్రొడక్షన్స్ సంస్థకి, మంజు వారియర్, రానా దగ్గుబాటి సహా ఇతర నటీనటులకు, సినిమాకు వర్క్ చేసిన టెక్నీషియన్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరికీ ధన్యవాదాలు. సినిమా కోసం డైరెక్టర్ జ్ఞానవేల్ కలిసినప్పుడు.. మీరు సందేశాత్మక సినిమాలు తీస్తుంటారు. కానీ నాతో కమర్షియల్ సినిమాలు తీయాలి. మీ స్టైల్ వేరు, నా స్టైల్ వేరు అని చెప్పాను. తర్వాత తను చెప్పిన కథ విన్నాక నాకు నచ్చింది. తర్వాత కొద్ది కొద్దిగా మార్పులు చేయించాను. ఇక మెల్లగా పెద్ద పెద్ద టెక్నీషియన్స్ సినిమాలో యాడ్ అయ్యారు. అమితాబ్ పాత్ర గురించి జ్ఞానవేల్ చెప్పి, ఆయనే చేయాలని చెప్పగా, నిర్మాతలతో మాట్లాడమని చెప్పాను. డైరెక్టర్ సుభాస్కరన్‌తో మాట్లాడి అమితాబ్‌ను ఒప్పించారు. అలా ఆయన టీమ్‌లో భాగమయ్యారు. ఎప్పుడైతో అమితాబ్ ఇందులో నటింటానికి ఒప్పుకున్నారని తెలిసిందో అప్పుడు నాలో ఉత్సాహం ఇంకా పెరిగింది. ఎందుకంటే వృత్తిపరంగానే కాదు, పర్సనల్‌గానూ అమితాబ్ నాకు ఇన్‌స్పిరేషన్ ఇచ్చిన వ్యక్తి. ఇక జ్ఞానవేల్ చాలా మంచి వ్యక్తి. తన కోసం ఈ సినిమా హిట్ కావాలని అనుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని, జ్ఞానవేల్ ఇంకా గొప్ప స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు.
అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. ‘రజినీకాంత్‌తో చాలా సంవత్సరాలుగా మంచి పరిచయం ఉంది. వృత్తి పరంగానే కాదు, వ్యక్తిగతంగానూ తను నాకెంతో సన్నిహితంగా ఉంటారు. రజినీకాంత్ పాత్ర గురించి, నా పాత్ర గురించి తెలిసిన తర్వాత నేను జ్ఞానవేల్ నెరేషన్ నచ్చి సినిమా చేయటానికి ఒప్పుకున్నాను. రజినీకాంత్‌తో యాక్ట్ చేయటానికి గొప్పగా, గర్వంగా భావిస్తున్నాను. తను మనందరికీ ఓ మంచి గిఫ్ట్. గ్రేట్ హ్యుమన్ బీయింగ్. చాలా సింపుల్‌గా కనిపిస్తారు. అక్టోబర్ 10న వేట్టైయాన్ రిలీజ్ అవుతుంది. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు.