Maharashtra: చంద్రపూర్‌లో దారుణం.. చిరుతపులి దాడిలో 7 ఏళ్ల బాలుడు మృతి

by Harish |
Maharashtra: చంద్రపూర్‌లో దారుణం.. చిరుతపులి దాడిలో 7 ఏళ్ల బాలుడు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: తెలంగాణ సరిహద్దు ప్రాంతం మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఒక చిరుత పులి దాడిలో 7 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. సినాలా గ్రామానికి చెందిన భవేష్ ఠాకూర్ అనే బాలుడు శుక్రవారం బహిర్భూమికి వెళ్లాడు. అయితే అలా వెళ్లిన అతను ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బాలుడి కోసం గాలించారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో చిరుతపులి ఉండడం చూసిన ఒక వ్యక్తి పోలీసులకు, అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించాడు. రాత్రంతా బాలుడి కోసం వెతికినప్పటికి అతని జాడ కనిపించలేదు. అయితే శనివారం ఉదయం తిరిగి గాలించగా, అతని మృతదేహం లభ్యమైంది. పోలీసులు బాలుడు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిర్వహించారు. చిరుత పులి దాడిలో బాలుడు మరణించినట్లు సిబ్బంది తెలిపారు. బాలుడి కుటుంబానికి ప్రాథమిక పరిహారంగా రూ.1 లక్ష అందించామని, చిరుత పులిని పట్టుకునేందుకు బృందాలు సిద్ధంగా ఉన్నాయని అటవీ శాఖ అధికారి తెలిపారు.

Advertisement

Next Story