- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంచలన పరిణామం.. బీజేపీ ఎమ్మెల్యేపై కోడిగుడ్లతో దాడి
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ ఎమ్మెల్యే(BJP MLA)పై కొడిగుడ్లతో దాడికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. ఈ అనూహ్య పరిణామం కర్ణాటక(Karmatala) రాష్ట్రంలోని రాజరాజేశ్వరి నగర్ ఎమ్మెల్యే మునిరత్నం(MLA Muniratnam)పై చోటు చేసుకుంది. తన నియోజకవర్గంలో బుధవారం ఆర్‌ఆర్ నగర పరిధిలోని లక్ష్మిదేవి నగర్ వార్డు బీజేపీ(BJP) కార్యాలయంలో వాజ్‌పేయి జయంతిలో పాల్గొనేందుకు వెళ్తున్న సందర్భంగా గుర్తు తెలియని దుండగులు ఈ దాడి చేశారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నం మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ అతని తమ్ముడు తనని చంపడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. అలాగే ఈ దాడి చేసింది ముమ్మాటికి కాంగ్రెస్(Congress) కార్యకర్తలే అంటూ.. ఎమ్మెల్యే మునిరత్నం(MLA Munirathna) రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.
కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ వీడియోలో రోడ్డుపై తన అనుచరులు, ప్రజలతో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న ఎమ్మెల్యే తలపై కొడి గుడ్డు తగిలి పగలడం స్పష్టంగా కనిపించింది. ఈ ఘటనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర(BJP state president Vijayendra) తీవ్రంగా ఖండించారు. ఈ దాడి కర్ణాటక రాష్ట్రానికి జరిగిన అవమానం అన్నారు. గతంలో కూడా సువర్ణ సౌధలో ఎమ్మెల్సీ సీటీ రవి(MLC CT Ravi)పై దాడి చేశారని, సొంత నియోజకవర్గంలో తిరుగుతున్న ఎమ్మెల్యేపై దాడిని ఏమని అర్థం చేసుకోవాలని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కాగా ఈ దాడికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.