Andhra Pradesh:ఏపీలో జోరుగా పొరుగు రాష్ట్రాల మద్యం!

by Jakkula Mamatha |
Andhra Pradesh:ఏపీలో జోరుగా పొరుగు రాష్ట్రాల మద్యం!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం(AP Government) నూతన లిక్కర్ పాలసీ(New Liquor Policy) ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఏపీలోకి పొరుగు రాష్ట్రాల మద్యం(alcohol) ఎక్కువగా వస్తోంది. ఈ ఏడాది నవంబర్ వరకు 1.89 లక్షల లీటర్ల ఇతర రాష్ట్రాల మద్యాన్ని ఎక్సైజ్, పోలీస్ శాఖలు సీజ్ చేశాయి. ఈ నెలలో అనంతపురంలో పట్టుబడిన 30 వేల గోవా మద్యం బాటిళ్లనూ కలుపుకుంటే 2 లక్షల లీటర్లు దాటనుంది. అక్టోబర్ నెలలో ఆదోనిలో కర్ణాటక మద్యం 14 కేసులు దొరికింది. ఇక చిత్తూరుకు తమిళనాడు మద్యం(alcohol) వస్తున్నట్లు సమాచారం. అయితే కొన్ని బ్రాండ్ల ధరలు ఎక్కువగా ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది. అలాగే ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లోకి పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం భారీగా వస్తోంది. గతేడాది ఇదే సమయానికి 71, 365 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు. రాష్ట్రంలో మద్యం ధరలు కొంత ఎక్కువగానే ఉండటం కూడా NDPL రావడానికి ఓ కారణంగా చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed